విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కింగ్ జార్జి ఆసుపత్రి ఆవరణలో పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న చిన్నపిల్లల అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న 28 రోజుల వయసున్న ఆడ శిశువు మృతిచెందడం వివాదానికి దారి తీసింది. రక్తం ఎక్కించిన కొద్దిసేపటికే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించిందని, విధి నిర్వహణలో ఉన్న నర్సు దృష్టికి ఈ అంశం తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచిందని శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రి నర్పు నిర్లక్ష్యంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లా గరివిడి మండలం తాడిగుడ గ్రామానికి చెందిన సౌందర్యకు డిసెంబర్ 11న విజయనగరం ఘాషాసుపత్రిలో ప్రసవమైంది. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది.

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

అయితే ఆ శిశువు ఉమ్మనీరు తాగడం వల్ల పుట్టగానే అస్వస్థతకు గురైంది. దంతో బిడ్డను విజయవనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్యం చేయించినట్లు తల్లి చెప్పారు. డిసెంబర్ 29 వరకూ వైద్యం చేయించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లామని, ఆ తర్వాత బిడ్డ కాలికి ఇన్‌ఫెక్షన్ రావడంతో ఈనెల 4న కేజీహెచ్‌లో చేర్పించామన చెప్పారు.

 కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

5న ఆసుపత్రిలో బిడ్డకు ఆపరేషన్ చేశారని, 6న తేదీ రాత్రి రక్తం ఎక్కించారన్నారు. రక్తం ఎక్కించిన తర్వాత బిడ్డ ఆరోగ్య స్థితి ఒక్కసారిగా విషమించిందని, వెంటనే విధి నిర్వహణలో ఉన్న నర్సును ఆప్రమత్తం చేశామని, అయినా ఆమె పట్టించుకోలేదని తల్లి సౌందర్య ఆరోపించారు.

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

రక్తం ఎక్కించే చోట పాప చెయ్యి వాచిపోయందని, తెల్లవారుజాము నుంచి ఎగ ఊపిరి వ్చచి బిడ్డ మృతి చెందిందన్నారు. తమ బిడ్డను చూసేందుకు వైద్యులు కూడా రాలేదని ఆమె ఆరోపించారు. మృతి చెందిన తర్వాత వైద్యులు హడావుడిగా వచ్చి చచ్చిపోయిందని చెప్పారన్నారు.

 కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేవలం కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంగా తన బిడ్డ విగతజీవిగా మారిందని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. పాప తండ్రి శివరామ్ ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్‌ను చిన్నారి తల్లిదండ్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

దీనికి ఆయన మాట్లాడుతూ ఘటనపై విచారణ చేయిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలను తీసుకంటామన్నారు. దీనిపై ఆసుపత్రి సూపరిడెంట్ స్పందించారు. 'సెప్టిసేమియా' అనే వ్యాధితో బాధపడుతూ బిడ్డ ఆసుపత్రిలో చేరిందని, అవసరమైన వైద్య అందించామని చెప్పారు.

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

కేజీహెచ్‌లో 28 రోజుల శిశువు మృతి: నర్సు నిర్లక్ష్యమే కారణమంటూ నిరసన

అయితే నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణకు డాక్టర్ అర్జున ఆధ్వర్యంలో ముగ్గురు సీనియర్ వైద్యులతో కమిటీ వేస్తున్నామని ఆయన చెప్పారు. విచారణ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలను తీసుకుంటామని ఆయన చెప్పారు.

English summary
28 days baby dies at kgh in visakhapatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X