వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా 2918, 7.86 లక్షలకు చేరిన మొత్తం కేసులు, 24 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం కంటిన్యూ అవుతోంది. టెస్టులు పెరుగుతున్న కేసులు కూడా వస్తోన్నాయి. అయితే గతంలో మాదిరిగా 10 వేల చొప్పున కాక.. 2 నుంచి 3 వేల వరకు వస్తున్నాయి. గత 24 గంటల్లో కూడా 3 వేల వరకు కేసులు వచ్చాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

4వ శక్తిమంతమైన దేశంగా భారత్ - 'ఆసియా-పసిఫిక్’లో అమెరికా-చైనా పోటాపోటీ - గేమ్ ఛేంజర్ కరోనా4వ శక్తిమంతమైన దేశంగా భారత్ - 'ఆసియా-పసిఫిక్’లో అమెరికా-చైనా పోటాపోటీ - గేమ్ ఛేంజర్ కరోనా

ఏపీలో గత 24 గంటల్లో 61 వేల 330 శాంపిళ్లను పరీక్షించారు. అయితే 2 వేల 918 మందికి వైరస్ సోకింది. దీంతో కరోనా వచ్చిన మొత్తం సంఖ్య 7 లక్షల 86 వేల 50కి చేరుకుంది. వీరిలో 35 వేల 65 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 4 వేల 303 మంది కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకి 24 మంది చనిపోయారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య 6 వేల 453 మందికి చేరింది.

2918 corona cases register in andhra pradesh

Recommended Video

Humans Organs Effected By Corona | చేప కింద నీరు లా... | Oneindia Telugu

ఇప్పటివరకు 71 లక్షల 27 వేల 533 పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో తెలిపింది. చనిపోయిన వారి వివరాలను జిల్లాలవారీగా ప్రకటించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలో నలుగురు.. కడపలో 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున చనిపోయారు.

English summary
2918 coronavirus positive cases register in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X