వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే ఎమ్మెల్సీ ఎన్నిక‌లు : ఏపిలో మూడు స్థానాల‌కు పోటీ..

|
Google Oneindia TeluguNews

ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని మూడు శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5,62,186 మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. మూడు చోట్ల కలిపి మొత్తంగా 94 మంది పోటీ పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు.

ప్రారంభ‌మైన పోలింగ్‌..

3 constituencies..82 candidates : MLC elections polling started..


ఏపిలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 817 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం ఎనిమిదింటికి ప్రారం భమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిం చనున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎంతగా బారులు తీరారో తెలుసుకుని అక్కడికి వెళ్లేందుకు వీలుగా మై ఓటు క్యూ యాప్‌ను కూడా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గ పరిధి ఓటర్లకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను ప్రకటించారు. ఓట‌ర్ల‌కు ఎపిక్ కార్డులు లేకుంటే ప్ర‌త్యామ్నాయ ప‌త్రాల ద్వారా ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించింది ఎన్నిక‌ల సంఘం. ప్ర‌త్యామ్నాయంగా పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు, అధికారిక గుర్తింపు కార్డు ల్లో ఒకటి చూపించి ఓటేయొచ్చు.

సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనా <br>సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనా

బ‌రిలో 94 మంది అభ్య‌ర్దులు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం లో మొత్తం ఎనిమిది మంది బరిలో ఉన్నారు. ఇక్కడినుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గా ఉన్న గాదె శ్రీనివాసులునాయుడు మరోసారి పోటీ పడుతున్నారు. పీఆర్‌టీయూ సహా మరికొన్ని సంఘాల మద్దతు ఆయనకుంది. ఏపీటీఎఫ్‌ 1938, బీటీఎఫ్‌ తదితర సంఘాల మద్దతుతో అడారి కిషోర్‌కుమార్‌ బరిలో ఉన్నారు. ఏపీటీఎ ఫ్‌ 257 మద్దతుతో పాకలపాటి రఘువర్మ పోటీ చేస్తున్నారు. ఆపస్‌ అభ్యర్థిగా జన్నెల బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. మరి కొంత మంది కూడా ఈ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. ఇక‌, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం: మొత్తం 46 మంది పోటీలో ఉన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత ఎన్‌.శేషారెడ్డి, పీడీఎఫ్‌ అభ్యర్థి ఐ.వెంకటేశ్వరరావుతో పా టు మ‌రి కొంత మంది పోటీలో నిలిచారు. గుంటూరు- కృష్ణా ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుండి 40 మంది అభ్య‌ర్దులు బ‌రిలో నిలిచారు.

English summary
MLC polling started in Three constituency's in Andhra Pradesh. For two teacher constitunecys and one for Graduate cons tituency elections going on. Up to evening 4 o clock polling will be continue. Total 94 candidates is in contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X