విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలుగు రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు(28) ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం హాస్టల్‌లోని తన గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా కొండలరావు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, కొండలరావు స్వస్థలం విజయనగరం. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.

31-year-old Telugu research scholar found hanging in IIT-Kharagpur hostel.

విజయనగరం ఎస్పీ అనుమతితో ఖరగ్‌పూర్‌కు కొండలరావు తల్లిదండ్రులు బయల్దేరి వెళ్లారు. కాగా, కొండలరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
అయితే, ఇష్టం లేని చదువు కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, కొండలరావుకు ఫిబ్రవరిలోనే వివాహం జరగడం గమనార్హం. ఆ తర్వాత లాక్ డౌన్‌కు కొద్ది రోజుల ముందు కొండలరావు ఖరగ్‌పూర్ క్యాంపస్‌కు చేరుకున్నారు. అతని భార్య ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. మంచి భవిష్యత్ ఉన్న కొండలరావు ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ అన్నారు. కొండలరావు ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఏ విద్యార్థి కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఏ సమస్య ఉన్నా తమకు చెప్పాలన్నారు.

2015 లో ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరిన రావు.. తన పరిశోధన ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో ఉన్నారని అతని స్నేహితులు తెలిపారు. కొండలరావు చాలా కలుపుగోలు వ్యక్తని, అతను లేకపోవడం విచారకరమని అన్నారు.

English summary
31-year-old Telugu research scholar found hanging in IIT-Kharagpur hostel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X