వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

370 కోట్ల భారీ స్కామ్.. బ్యాంకులకు కుచ్చుటోపి..!

|
Google Oneindia TeluguNews

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూడనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకగా 370 కోట్ల కుంభకోణం బద్దలు కానుంది. భీమవరం కేంద్రంగా కొందరు సాగించిన స్కామ్ తాలూకు నిజాలు వెలుగు చూడనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్కామ్‌లో తెలివిగా వ్యవహరించిన కొందరు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేశారు.

నకిలీ పత్రాలతో ప్రైవేట్ బ్యాంకులకు కొందరు వ్యక్తులు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు 370 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని తిరిగి చెల్లించే క్రమంలో వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఉండటంతో సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

<strong>పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!</strong>పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!

370 crore rupess scam into lime light in bhimavaram west godavari district

370 కోట్ల రూపాయల రుణం తీసుకోవడమే గాకుండా.. ఆయా బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న వ్యవహారంలో స్థానికులైన పలువురు రాజకీయ నేతల హస్తముందనేది లోకల్‌గా వినిపిస్తున్న మాట. ఏళ్ల తరబడి బ్యాంకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా పలువురు వ్యక్తులు సతాయిస్తుండటంతో బ్యాంకు అధికారులు సీబీఐ అధికారులను ఆశ్రయించారు.

ఆ క్రమంలో భీమవరంతో పాటు పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా రుణాలు తీసుకున్నవారి రికార్డులు సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదలావుంటే జిల్లాలో సాధారణంగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అదే అదనుగా తీసుకుని కొందరు నకీల పత్రాలు సమర్పించి రుణాలు పొంది బ్యాంకులను మోసం చేసినట్లు సమాచారం. మొత్తానికి సీబీఐ అధికారుల ఎంట్రీతో ఎప్పుడేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

English summary
Huge scam to be seen in West Godavari district 370 crore scam. The incident has become a hot topic across the state as the facts of the scam expected to come to light. However, CBI officials are already investigating the case as who have taken big amount of loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X