వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో త్వరలో 3795 వీఆర్వో పోస్టుల భర్తీ- వీఆర్ఏలకు వన్ టైమ్ ఛాన్స్-మార్గదర్శకాలివే....

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వేలాది వీఆర్వో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ వీఆర్ఏలుగా ఉంటున్న వారిని అనుభవం, విద్యార్హతల ఆధారంగా వీఆర్వో పోస్టులకు ఎంపిక చేసేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. త్వరలో జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీల భర్తీ చేపడతారు.

Recommended Video

AP Govt To Recruit 3,795 VRO Posts Soon In The State

వీఆర్వో పరీక్షలో మహిళలకు అవమానం: పుస్తెలు తీయించడంపై గవర్నర్ ఆగ్రహంవీఆర్వో పరీక్షలో మహిళలకు అవమానం: పుస్తెలు తీయించడంపై గవర్నర్ ఆగ్రహం

 త్వరలో వీఆర్వో పోస్టుల భర్తీ...

త్వరలో వీఆర్వో పోస్టుల భర్తీ...

రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో భారీగా అధికారుల కొరత ఏర్పడటంతో వీఆర్వో గ్రేడ్ 2 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. అదే సమయంలో చాలా ఏళ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పనిచేస్తున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుని మిగిలిన వీఆర్వో గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గతంలోనే వీటి భర్తీకి ఆదేశాలు సర్కారు ఇచ్చింది.

 సర్కారు ఆదేశాలు- పట్టించుకోని కలెక్టర్లు...

సర్కారు ఆదేశాలు- పట్టించుకోని కలెక్టర్లు...

అనుభవజ్ఞులైన వీఆర్ఏలను వీఆర్వో పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా పలు జిల్లాల కలెక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వానికి రెవెన్యూ సహాయకుల సంఘం తాజాగా మరోమారు ఇదే అంశంపై విజ్ఞాపనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఈ పోస్టుల భర్తీపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు కూడా పంపారు. దీంతో వీటి భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

 వీఆర్వో పోస్టులకు అర్హతలివే...

వీఆర్వో పోస్టులకు అర్హతలివే...

రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 3795 వీఆర్వో పో్స్టుల భర్తీకి కచ్చితంగా ఇంటర్ లేదా దానికి సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. ఇంటర్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చదివిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత కోర్సు పూర్తి చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకుని ఉండాలి. ఆయా అర్హతల ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. అలాగే వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్ టైమ్ సర్వీస్ రూల్స్ నిబంధన అమలు చేస్తున్నారు.

English summary
andhra pradesh government has accorded permission to fill 3795 vro posts with five year experienced vra's with intermediate qualification. govt has released guidelines for these posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X