ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు, రెట్టింపైన రికవరీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్త కేసుల సంఖ్య 400 లోపే ఉండటం గమనార్హం. అదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య మాత్రం అంతకు రెట్టింపు ఉంది. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా నమోదైంది.
కరోనా పురోగతి ఎలావుంది?, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి: ఉత్పత్తిదారులతో ప్రధాని మోడీ

ఏపీలో కొత్తగా 381 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 381 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. తాజాగా నమోదైన వాటితో కలుపుకుంటే ఇప్పటి వరకు కోటికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 8,68,064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా, మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6992కు చేరింది. అనంతపురంలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు, కృష్ణాలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు మరణించారు.

ప్రకాశంలో సింగిల్ డిజిట్ కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో21, చిత్తూరులో 31, తూర్పుగోదావరిలో 45, గుంటూరులో 35, కడపలో 26, కృష్ణాలో 70, కర్నూలులో 12, నెల్లూరులో 19, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 11, విజయనగరంలో 20, పశ్చిమగోదావరిలో 74 కేసులు నమోదయ్యాయి.

రెట్టింపుగా రికవరీ..
కొత్తగా 934 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,53,232కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,840 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటుండటం గమనార్హం.

దేశంలోనూ తగ్గుతున్న పాజిటివ్ కేసులు..
మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,31,691కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 45,333 మంది కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 88,47,600గా ఉంది. గత 24 గంటల్లో 443 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,37,139కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులున్నాయి.