వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతి హత్యకేసు: నిందితుడు సహ ఉద్యోగే, కారణం అదే...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయనగరం జిల్లలో సంచలనం సృష్టించిన ఎస్.కోట్ రైల్వే ఉద్యోగిని హత్యే కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. పోలీసులకే పెను సవాల్‌గా మారిన ఈ కేసుని చేధించడానికి నెలరోజులు పట్టింది. మే 11న శృంగవరపుకోట మండలంలోని రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చిట్టిమోజు స్వాతి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అదే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి గోపి అని పోలీసులు గుర్తించారు. ప్రమోషన్ కోసమే స్వాతిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

4 held for railways employee's murder

ఈ హత్యకు ప్రధాన కారణం గోపాలపట్నంలో పని చేస్తున్న స్వాతిని ఎస్.కోటకు, ఎస్.కోటలో పనిచేస్తున్న నిందితుడిని గోపాలపట్నం బదిలీ చేయడమేనని పోలీసులు తెలిపారు. స్వాతిని బెదిరించి ఎస్.కోట నుంచి బదిలీ చేయించుకుని వెళ్లేలా ప్రయత్నించాడు.

అందుకు స్వాతి అంగీకరించకపోవడంతో ఆమెను చంపేందుకు పథకం రచించాడు. మరో ముగ్గురితో కలిసి స్వాతిని హత్య చేశాడు. గతంలో రైల్వే పోర్టర్‌గా పనిచేసిన గోపీకి ఇటీవల పదొన్నతి లభించింది. ఈ కేసులో సుమారు పన్నెండు వందల మంది వరకు అనుమానుతుల్ని విచారించారు. ఈ క్రమంలో స్వాతి హత్యకేసులో సహ ఉద్యోగే సూత్రధారి అన్న విషయం విచారణలో వెల్లడైంది.

English summary
According to police sources, Gopi an employee working in the same department has murdered her for promotion. Police also arrested the three others who assisted him in the ghasty incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X