ఏపీలో కరోనా ఉప్పెన, 4 వేల కేసులు, కోవిడ్ ఆస్పత్రుల పెంపు, పెట్రో, డీజీల్ ధరలపై వ్యాట్ మోత..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. నిన్న 5 వైల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ మరో 4 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 4 వేల 74 పాజిటివ్ కేసులు రాగా.. తూర్పుగోదావరి జిల్లాలో వెయ్యి కేసులు దాటాయి. వైద్యారోగ్యశాఖ బులెటిన్ ప్రకారం 1086 పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

53 వేల పైచిలుకు కేసులు..
గుంటూరులో 596, కర్నూలులో 559 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 53 వేల 724కి చేరింది. రాష్ట్రంలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 24 గంటల్లో 53 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 696కి చేరింది. సోమవారం 1335 మందిని డిశ్చార్జ్ చేయగా.. వైరస్ తగ్గిన వారి సంఖ్య 28 వేల 800గా ఉంది.

కోవిడ్ ఆస్పత్రుల పెంపు..
ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను పెంచుతూ డిసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రస్థాయి ఆసుపత్రులు ఉండగా, మరో ఆస్పత్రులకు కేటాయించారు. దీంతో మొత్తం ఆస్పత్రుల సంఖ్య 10కి చేరింది. జిల్లాల్లో గల 84 కరోనా ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచాలని ఆదేశించారు. దీంతో వైద్యులపై పని ఒత్తిడి.. రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతోందని భావన వ్యక్తమవుతోంది.

35 వేల నుంచి 45 వేల టెస్టులు
రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతున్నామని సీఎం జగన్ దృష్టికి అధికారులు తెలియజేశారు. రోజు 35 వేల నుంచి 45 వేల వరకు టెస్టులు చేస్తున్నారని తెలిపారు. సరిహద్దులను తెరవడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు వివరించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు చైతన్యం కల్పించాలన్నారు. 85 శాతం మంది ప్రజలకు ఇళ్లలోనే నయమవుతోందని.. టెలీమెడిసిన్‌పై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పెట్రో, డీజిల్ వాత
కరోనా మహమ్మారితో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఏపీ సర్కార్ షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ మోత మోపింది. లీటర్ పెట్రోల్ పై రూ. 1.24, లీటర్ డీజిల్ పై 0.93 పైసలు పెంచింది. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయినందున భారం మోపడం తప్పడం లేదు అని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో రూ. 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈ ఏడాది 29.5 శాతానికి తగ్గి రూ. 1,323 కోట్లకు పడిపోయిందని చెప్పారు.

వ్యాట్ బాదుడుపై టీడీపీ ఫైర్
లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని జగన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై రూ. 1.24, లీటర్ డీజిల్ పై 0.93 పైసలు వ్యాట్ పెంచింది. దీనిని ప్రతిపక్ష టీడీపీ తప్పుపట్టింది. క్లాస్ ఫస్ట్ రావాలంటే ఎం చెయ్యాలి అన్నాడు బాబు, మిగతావాళ్ళు పరీక్ష రాయకుండా చేయాలని అన్నారు. మద్యపాన నిషేధం చెయాలంటే మద్యం రేట్లు పెంచాలి, కరోనా సమయంలో ప్రజలు బయట తిరగకూడదంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాలని.. అలాగే పెంచేశారని అనిత ఎద్దేవా చేశారు.