వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 40 స్థానాలే కీల‌కం : ల‌గ‌డ‌పాటి లోతైన క‌స‌ర‌త్తు : పోలింగ్ స‌ర‌ళిలో గుర్తించిందేంటంటే..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ఆక్టోపస్ బృందం ఏపీ ఓటరు నాడి పట్టుకోవ‌టానికి క‌ష్టాలు ప‌డుతోంది. ఏపీలో ఫ‌లితాల అంచ‌నాల‌ను ఈనెల 19న వెల్ల‌డిస్తాన‌ని మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే, ఇంకా ఆంధ్ర ఓట‌రు నాడి తెలుసుకొనేందుకు ఆయ‌న బృందం లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇంత‌కీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆక్టోప‌స్ బృందం తేల్చిన అస‌లు విషయం ఏంటంటే..అంద‌రూ అంచనా వేస్తున్న‌ట్లుగా వార్ ఒన్‌సైడ్ జ‌ర‌గ‌లేద‌న్న‌ది బ‌య‌ట‌కు వ‌స్తున్న విష‌యం. మ‌రి..ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయంటే..

టీడీపీకి అనుకూలంగా ఉంద‌నే అంచ‌నాల‌తో..

టీడీపీకి అనుకూలంగా ఉంద‌నే అంచ‌నాల‌తో..

పోలింగ్ జ‌రిగిన నాటి నుండి టీడీపీ అధినేత త‌మ విజ‌యం ఖాయ‌మ‌ని చెబుతుంటే..మంత్రులు..అభ్య‌ర్దుల్లో మాత్రం ఆ స్థాయి ధీమా క‌నిపించ‌టం లేదు. అయితే, ఇప్ప‌టికే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ నేరుగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన స్పందించ‌లేదు. కానీ, తిరుమ‌ల‌లో స్పందించిన స‌మ‌యంలోనూ..అదే విధంగా అమెరికాలో జ‌రిగిన టీడీపీ ఎన్నారైల స‌మావేశంలోనూ ల‌గ‌డ‌పాటి ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. ఏపీ ప్ర‌జ‌లు సంక్షేమానికి..అభివృద్దికి ప‌ట్టం క‌ట్టారంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇదే స‌మ‌యంలో ఒపీనియ‌న్ పోల్ నిర్వ‌హించిన ఆయ‌న టీం.. ఎన్నిక‌ల త‌రువాత పోస్ట్ పోల్ స‌ర్వే సైతం నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. ఇందులో హోరా హోరీ పోరు జ‌రుగుతున్న స్థానాల పైన ప్ర‌త్యేక దృష్టి సారించారు. దీంతో..లోతుగా స‌ర్వే చేయిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందు కోసం ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల నాడి తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

40 సీట్లలో కీల‌కంగా..

40 సీట్లలో కీల‌కంగా..

ఏపీలోని 175 స్థానాల్లో టీడీపీ..వైసీపీ నువ్వా నేనా అన్న‌ట్లుగా త‌ల‌ప‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 40 వ‌రకు ఉన్న‌ట్లుగా గుర్తించారు. అక్క‌డ ఎవ‌రు గెలిచినా మెజార్టీ స్వ‌ల్పంగా ఉంటుంద‌ని తేల్చారు. అయితే, ఆ 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో మెజార్టీ స్థానాలు ఎవ‌రైతే గెలుస్తారో వారికే అధికారం ద‌క్కుతుంద‌ని గుర్తించారు. ఇందుకోసం ఈ 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లితం కోసం లెక్క‌లు మీద లెక్క‌లు వేస్తున్నారు. పోలింగ్ నాడు మ‌హిళ‌ల ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నార‌ని అదంతా ప‌సుపు కుంకుమ ఎఫెక్ట్ అంటూ టీడీపీ ధీమా వ్య‌క్తం చేస్తోంది. మ‌హిళ‌లు..వృద్దులు ఎంత ఎక్కువ‌గా పోలింగ్‌లో పాల్గొంటే అంత మెజార్టీ సీట్లు టీడీపీకి ద‌క్కుతాయ‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అందులో భాగంగానే పోలింగ్ నాడు ఈవీఎంల మ‌ర‌మ్మ‌త్తుల కార‌ణంగా పోలింగ్‌కు ఇబ్బంది ఎదురైన ప్రాంతాల్లో అర్ద‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ్గా..అక్క‌డ క్యూ లైన్ల‌లో మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఉన్నార‌ని చెబుతున్నారు.

వైసీపీ విశ్లేష‌ణ ఏంటంటే..

వైసీపీ విశ్లేష‌ణ ఏంటంటే..

పోలింగ్ స‌ర‌ళిపైన వైసీపీ మాత్రం మ‌రో ర‌కంగా విశ్లేష‌ణ చేస్తోంది. ఉద‌యం నుండి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల వ‌ద్ద ఓట‌ర్లు క‌నిపించార‌ని..వారంతా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తతో పాటుగా ఒక్క సారి జ‌గ‌న్‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే ఉద్దేశంతో వారు వైసీపీకి ఓటు వేసార‌ని చెబుతున్నారు. ప‌సుపు - కుంకుమ ల‌బ్ది దారులు మొత్తంగా టీడీపీ వైపే మొగ్గారని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నా..అందులోనూ విశ్లేష‌ణలు వ‌స్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఈ ల‌బ్ది దారులు తొలి నుండి ఎవ‌రి వైపు ఉన్నారో అదే విధంగా ఓట్లు వేసారు. ఇక‌, అర్బ‌న్ ప్రాంతంలోని ల‌బ్దిదారులు మాత్రం టీడీపీకి ప‌ట్టం క‌ట్టార‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నారు. పెన్ష‌న్ ల‌బ్దిదారుల ఓట్లు ఎక్కువ శాతం టీడీపీకే ప‌డ్డాయ‌న్న‌ది వారి అంచ‌నా. వైసీపీ మాత్రం వీటిని కొట్టి పారేస్తోంది. ప్ర‌జ‌లంతా స‌మిష్టిగా ఒకే ఆలోచ‌న‌తో క‌దిలార‌ని..పోలింగ్ స‌ర‌ళి ఖ‌చ్చితంగా వైసీపీకే అనుకూలంగా ఉంద‌ని వైసీపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
Andhra Octopus Lagadapati Rajagopal Survey still going on in AP. Lagadapati indirectly hinted TDP win in AP Elections. But, 40 seats come to crucial in AP Results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X