విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంకల్ప బలం ముందు బోసిపోయిన అనుభవం, ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని నాని, చంద్రబాబుపై ఫైర్

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాట తప్పడం, మడమ తిప్పడం తెలియదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చేయనిది.. కేవలం మూడునెలల్లో సీఎం జగన్ చేశారని తెలిపారు. విజయవాడ డిపోలో ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగుల కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పాల్గొని ప్రసంగించారు.

చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.

నిర్లక్ష్యం..

నిర్లక్ష్యం..

ఆర్టీసీ కార్మికుల పట్ల గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్ని నాని తెలిపారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబే చేయలేకపోయారని గుర్తుచేశారు. సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేసి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఆర్టీసీని విలీనం చేసే ధైర్యం చేయలేకపోయారని తెలిపారు. కానీ జగన్ అలా కాదని, ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని విలీనం చేశారని తెలిపారు.

ఆశలు పెట్టుకోవద్దు..

ఆశలు పెట్టుకోవద్దు..

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన ఘటనను మంత్రి పేర్ని నాని ఉదహరించారు. అప్పటి సీఎంను కార్మికులు ఆహ్వానించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారని తెలిపారు. దానికి చంద్రబాబు విలీనం లేదని తెగేసీ చెప్పారన్నారు. అంతేకాదు పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దని.. ఆర్టీసీ నాశనమైపోతుందని కామెంట్ కూడా చేశారని చెప్పారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు చేయనిది సాహసం జగన్ చేశారన్నారు.

సంకల్ప బలమే మిన్న

సంకల్ప బలమే మిన్న


ఏదైనా మంచి పనిచేయాలంటే అనుభవం ముఖ్యం కాదని.. సంకల్ప బలం అని పేర్ని నాని నొక్కి వక్కానించారు. చంద్రబాబు సీనియర్ నేత, సీఎంగా పనిచేశారు.. అదే జగన్ తొలిసారి ముఖ్యమంత్రి పదవీ చేపట్టారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు.. కానీ ఆయన సంకల్ప బలం మాత్రం మెండు అని.. అనుకున్న పని చేసేవరకు విడిచిపెట్టరని గుర్తుచేశారు.

కేసీఆర్ కూడా..

కేసీఆర్ కూడా..


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పొరుగురాష్ట్ర ఉద్యోగులు కోరితే, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కుదరదని చెప్పిన విషయాన్ని పేర్ని నాని గుర్తుచేశారు. విలీనం చేయకుంటే పన్ను మిగులుతుందని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు. కానీ ఏపీలో మరో మూడు నెలల్లో ఏం జరుగుతుందో చూడాలని కోరారు.

ఉద్యోగుల హర్షం

ఉద్యోగుల హర్షం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి నేరుగా తమ వేతానాలు ఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు.

English summary
40 years industry not merge employees to rtc, but cm jagan do.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X