వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరిగిన ఎండ తీవ్రత: వడదెబ్బకు 42 మంది మృతి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో వీస్తున్న తీవ్రమైన వడగాల్పులకు తట్టుకోలేక సోమవారం ఒక్క రోజులోనే 42 మంది మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లాలో 15 మంది, విశాఖ జిల్లాలో 17 మంది, విజయనగరం జిల్లాలో 10 మంది వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 32 మంది మృతి చెందినట్టు తెలిసింది. వడ గాలుల తీవ్రతతో అనేక ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల ద్వారా జిల్లా యంత్రాంగానికి తగిన సమాచారం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మృతి చెందినవారి వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కె రాజుపురం గ్రామానికి చెందిన బుగడ అప్పయమ్మ(65), భిన్నలమదనాపురం గ్రామానికి చెందిన జెన్న గడ్డమ్మ (62), పెద్దకేశుపురం గ్రామానికి చెందిన మడియా బాపనమ్మ (52), హంసరాళి గ్రామానికి చెందిన సత్యవతి (54), కొత్తఅగ్రహారానికి చెందిన పిన్నింటి ఆదినారాయణ (72)మృతి చెందారు.

42 die of sunstroke in Andhra Pradesh

శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం సవరపేటకు చెందిన రెడ్డి సాయమ్మ (52), కవిటి మండలం బొరివంకకు చెందిన బిసాయి గుణనిధి (51), రణస్థలం మండలం నారువకు చెందిన లక్ష్మీదుర్గ (6), కోష్టకు చెందిన కాంతమ్మ (65) గార మండలం పూసర్లపాడుకు చెందిన జెన్నాడ దాలమ్మ (43), నరసన్నపేట మండలం వజ్రమ్మపేటకు చెందిన అచ్చయమ్మ (75), కొత్తపేటకు చెందిన పల్లి రాములు (65), జలుమూరు మండలం పాగోడుకు చెందిన బట్ట చిన్నమ్మడు (60), ఎచ్చెర్ల మండలం కింతలిమిల్లుకు చెందిన తొమ్మిది నెలల బాలుడు కూటికుప్పల ఉమామహేశ్వరావు, ఫరీదుపేటకు చెందిన కాంచన లక్ష్మి (38) వడదెబ్బకు గురై మృతిచెందారు.

విశాఖ జిల్లాలోని పరవాడ మండలానికి చెందిన వాసపల్లి వెంకన్న (60), విశాఖ నగరం 46వ వార్డు ఉప్పర కాలనీకి చెందిన టి.అప్పారావు (65), అక్కిరెడ్డిపాలెంలో చిట్టిబిల్లి సన్యాసిరావు(74), మాడుగుల మండలాని చెందిన పెచ్చేటి అప్పియమ్మ (65), చీడికాడ మండలానికి చెందిన పెదగోగాడకి చెందిన గవిరి పార్వతి (70), కె కోటపాడు మండలానికి చెందిన రొంగలి అప్పలనాయుడు (67), చౌడువాడకు చెందిన రాజి సత్యం (67), పాయకరావు మండలానికి చెందిన గట్టెం కనకయ్య (59) కొయ్యూరు మండలానికి చెందిన ఎర్రయమ్మ (63), రామరాజుపాలెంకు చెందిన జి రాజుబాబు (60), రోలుగుంట మండలాకి చెందిన రుత్తల ఎర్రయ్యమ్మ, కె నాయుడుపాలెంకు చెందిన అడిగర్ల దొంగబుల్లి, రావికమతం మండలానికి చెందిన మట్టా చిన్నబ్బాయి (65), చోడవరం మండలానికి చెందిన విశ్రాంత పిఎసిఎస్ ఉద్యోగి ఆడారి గాంధీ (70), గజపతినగరంకు రాకుర్తి సింహాచలం (70), ఎడ్లవీధికి చెందిన సిరసపల్లి అనూష (32), గోవాడకు చెందిన జామి సింహాచలం (65) వడదెబ్బకు గురై మృతిచెందారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిరూరల్ మండలం పక్కి గ్రామానికి చెందిన గొంగాడ అచ్చెమ్మ (60), కోమటిపల్లి గ్రామానికి చెందిన రంభ రాము (58), జగన్నాథపురం గ్రామానికి చెందిన సువ్వాడ గోపాలం (57), బొబ్బిలి పట్టణపరిధిలోని గొల్లపల్లికి చెందిన జి సాంబయ్య, మక్కువ మండలం పెదగేసల గ్రామానికి చెందిన వి రంగారావు (55), వేపాడ మండలానికి చెందిన బాలింత ఇరుసుపల్లి అనూష (26), కరకలవలస గ్రామానికి చెందిన వలిరెడ్డి అప్పారావు (60), వావిలపాడు గ్రామానికి చెందిన ఇసరపు సన్యాసమ్మ (65), పార్వతీపురం పట్టణంలోని బూరాడ వీధికి చెందిన సంచాన రాములు (65), గళావిల్లి గంగమ్మ (70) వడదెబ్బతో మృతిచెందారు.

English summary
42 persons lost their lives today in Andhra Pradesh due to sunstroke even as various parts of the state continued to reel under scorching heat with the mercury level hovering between 40 and 46 degrees Celsius for the fourth consecutive day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X