వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ యువనేత బర్త్ డే వేడుకతో 45 మందికి కరోనా పాజిటివ్, సామాన్యులకే నిబంధనలా, లోకేశ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజలను మాస్క్ పెట్టుకోవాలని వేధిస్తారు.. మరీ వైసీపీ యువ నేత పుట్టిన రోజు వేడుకల సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. ఇదీ జగన్ సర్కార్‌కు కనిపించలేదా అని ట్వీట్లు చేశారు. మరో రాజమండ్రి మైనర్ బాలిక ఘటనకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతోందని నిలదీశారు.

Recommended Video

COVID 19 In India: భారత్‌లో ఒక్కరోజే 39 వేల కేసులు, వ్యాక్సిన్ వచ్చేలోపే కబళించేలా కరోనా వైరస్ !

సామాన్యులకేనా..?

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న క్రమంలో.. నిబంధనలను పాటించని వారిని జాతీయ మీడియా ‘కోవిడియట్స్' అని అంటోన్న విషయాన్ని లోకేశ్ ట్వీట్‌ చేశారు. అయితే ఏపీలో కొందరీలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. సామాన్యులను మాత్రం మాస్క్ పెట్టుకోవాలని.. లేదంటే జరిమానా అంటూ బెదిరింపులకు గురిచేస్తారు. మరీ యువనేత బర్త్ డే పార్టీ గురించి ఏమంటారు అన్నారు. సామాన్యులు మాస్క్ పెట్టుకోవాలని లేదంటే ఉపేక్షించబోం అని జీవో కూడా తీసుకొచ్చారని లోకేశ్ గుర్తుచేశారు. బర్త్ డే, ర్యాలీలు, ప్రారంభోత్సవాలు అంటూ హడావిడి చేస్తున్నారని తెలిపారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ యువనేత బర్త్ డే ఈ నెల 17వ తేదీన జరిగింది. రావులపాలెం మండలం ఊబలంకలో జరిగిన వేడుకకు చాలామంది హాజరయ్యారు. బర్త్ డే తర్వాత చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా 25 మంది నేతలకు పాజిటివ్ వచ్చింది. వారి ద్వారా మరో 25 మంది కుటుంబసభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 45 మందికి పాజిటివ్ రాగా.. మరో 81 మంది ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్ కేసులు భారీగా రావడంతో మరోవైపు ఊబలంక ప్రజలు భయపడిపోతున్నారు.

చర్యలు తీసుకోరా..?

రాజమండ్రిలో మైనర్ బాలికపై రేప్ ఘటనలో చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతోందని లోకేశ్ ఫైరయ్యారు. ప్రచార ఆర్బాటాలకు చూపించిన శ్రద్ద మహిళల రక్షణకు చూపడం లేదన్నారు. దిశ తొలి పోలీసు స్టేషన్ ప్రారంభించిన రాజమండ్రిలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైందని లోకేశ్ గుర్తుచేశారు. జగన్ సీఎం పదవీ చేటట్టిన ఏడాదిలో 234 లైంగిక దాడులు జరిగాయని తెలిపారు. 21 రోజుల్లో న్యాయం చేస్తామని జగన్ హామీనిచ్చారని.. ఏ ఒక్క మహిళకు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు.

మైనర్ బాలిక గ్యాంగ్ రేప్

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన మైనర్ బాలిక పదో తరగతి పూర్తిచేసింది. తల్లికి సాయం చేసేందుకు పనులకు వెళ్తే.. కొందరు మృగాళ్లు సామూహిక లైంగికదాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 12 మందిని అరెస్ట్ చేశారు. లైంగికదాడి, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు కానీ.. ఇంకా శిక్షించకపోవడంపై నారా లోకేశ్ ప్రశ్నించారు.

English summary
45 people infected coronavirus who attend ysrcp leader birthday in east godavari district tdp leader nara lokesh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X