హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో గత 24 గంటల్లో 48 పాజిటివ్.. తెలంగాణాలోనూ తగ్గని కేసులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతుంది. తాజా బులిటెన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,886. పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్న తీరు ఏపీ సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అయినా సరే ఏపీ ప్రభుత్వం పరీక్షల విషయంలో ఏం మాత్రం తగ్గటం లేదు .

corona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానంcorona update : కరోనా కేసుల్లో టాప్ 10 లో భారత్ .. కొత్త కేసుల నమోదులో 4వ స్థానం

గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 55 మంది డిశ్చార్జ్‌ అయ్యారని కూడా తెలిపింది. ఇక ఏపీలో ప్రస్తుతం ఆస్పత్రిలో 938 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,892 మంది డిశ్చార్జ్ అయ్యారు. అతి తక్కువ శాతం మరణాల రేటు నమోదు అవుతుండగా చాలా మంది ఇప్పటికే కరోనా నుండి కోలుకున్నారు. ఇక తాజాగా తూర్పు గోదావరిలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 57కి చేరింది.

48 positive in the last 24 hours in the AP.. telangana cases also increasing

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో ప్రజల్లో భయాందోళన మరింత పెరుగుతుంది. ఇక ఏపీలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రం తెలంగాణా సైతం కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్నా కరోనా కేసులు మాత్రం తగ్గటం లేదు . ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు కూడా మరింతగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి చేరుకుంది . కరోనాతో సోమవారం మరో ముగ్గురు మరణించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 56కు చేరుకుంది. ఇక ఇప్పటిఅరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1164కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 700 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక భారత దేశంలోనూ కరోనా కంట్రోల్ లోకి రావటం లేదు . ఇది ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం .

English summary
According to the latest bulletin, there have been 2,886 corona positive cases. A total of 48 Corona positive cases have been registered in last 24 hours officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X