వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు: మహిళలకే డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు: సీఎం జగన్..!

|
Google Oneindia TeluguNews

జిల్లాల్లోని అన్ని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు..రాష్ట్రస్థాయిలోని సెక్రటేరియట్‌లో కూడా అవుట్‌ సోర్సింగ్‌ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ కార్పోరేషన్ ను సీఎం ప్రారంభించారు. మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్నదే ఉద్దేశమని స్పష్టం చేసారు. జీతం ఇచ్చేటప్పుడు... ఉద్యోగులను మోసం చేయకుండా ఉండేందుకే ఈనిర్ణయం అమలు చేస్తున్నామని చెప్పారు. లంచాలు తీసుకుని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసారు. మోసాలకు తావులేకుండా, లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం స్పష్టం చేసారు. అదే విధంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 50శాతం మంది ప్రతి కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఉండాలని నిర్ధేశించారు.

నవంబర్‌ 14 నుంచి ఇసుక వారోత్సవాలు: సెలవులు రద్దు...అక్రమ రవాణపై కఠిన చర్యలు: సీఎం జగన్..!నవంబర్‌ 14 నుంచి ఇసుక వారోత్సవాలు: సెలవులు రద్దు...అక్రమ రవాణపై కఠిన చర్యలు: సీఎం జగన్..!

జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు మహిళలకే..
జిల్లా స్థాయిలో అన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాల భర్తీ కి క్యాలెండర్ నిర్ణయించారు. పీఎఫ్, ఈసీఎస్‌ఐ లాంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని..సకాలానికే జీతాలు వచ్చేలాచూడ్డానికి ఈ కార్పోరేషన్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. అవుట్‌ సోర్స్‌ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయిలోకి రావాలన్నారు. డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు కమిటీ నుంచి, శాఖాధిపతుల నుంచి రావాలని ఆదేశించారు. జనవరి ఒకటో తేదీ నుండి ప్లేస్ మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని జగన్ నిర్దేశించారు. జిల్లా స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారు. జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారని సీఎం స్పష్టం చేసారు.

CM jagan decied to give 50 percentage reservation in out sourcing jobs as women quota.

మంత్రి అప్రూవల్ అధారిటీగా..
ఇక, సెక్రటేరియట్‌ వచ్చేసరికి సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారు.. సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా ఉంటారని సీఎం చెప్పారు. ఇక్కడ కూడా జిల్లాల్లో ఎలాగైతే ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారో అదే విధంగా అమలు చేయాలని సూచించారు. డిసెంబర్‌ 15లోగా ప్రక్రియను పూర్తిచేసి, జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్స్‌ ఉండాలని స్పష్టం చేసారు. మోసాలకు, అవినీతికి తావులేకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

English summary
CM jagan decied to give 50 percentage reservation in out sourcing jobs as women quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X