ఏపీ సీఎం జగన్‌కు ఆర్మీ ఆహ్వానం -తిరుపతిలో బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు -కీలక హామీలు
భారత బలగాలు.. పాకిస్తాన్ సైనికుల పీఛమణిచేసి.. బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన 1971 యుద్ధ విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్ ఆర్మీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 'గోల్డెట్ విక్టరీ ఇయర్' వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల(ఫిబ్రవరి) 18న తిరుపతి పట్టణంలో మెగా ఈవెంట్ ను తలపెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ లకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి..

తాడేపల్లికి మేజర్ జనరల్ ఆర్కే సింగ్
భారత సైన్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల జనరల్ ఆఫీసర్ కమాండింగ్ గా వ్యవహరిస్తోన్న మేజర్ జనరల్ ఆర్కే సింగ్ గురువారం తాడేపల్లికి వెళ్లి, క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి, బాంగ్లా యుద్ధ విజయోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు. సైన్యం ఆహ్వానం పట్ల సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆర్కే సింగ్.. అమరావతి సచివాలయంలో ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌ను కూడా కలిశారు. ఈనెల 18న తిరుపతిలో నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు సీఎస్ ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా..
అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణ

డిఫెన్సు కాంప్లెక్సులపై చర్చ
సీఎస్ ఆదిత్యనాథ్ ను కలిసిన సందర్భంలో మేజర్ జనరల్ ఆర్కే సింగ్.. ఏపీలో ఆర్మీకి సంబందించిన పలు వ్యవహారాలను చర్చించారు. ప్రధానంగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్సుకాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని సింగ్ కోరారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌కే పరిమితమైన నేపధ్యంలో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ తగిన వసతులు కల్పించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సులు ఉపయోగపడతాయని, భూకేటాయింపులు, అనుమతులపై శ్రద్ధవహించాలని సీఎస్‌కు విజ్ణప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం స్థలాను కేటాయిస్తే రక్షణశాఖ నిధుల ద్వారా నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు.
కుప్పం పంచాయితీలోనూ మాదే గెలుపు -అమిత్ షాపై రాళ్లదాడి, కాళ్లబేరాలా? -చంద్రబాబుపై వైసీపీ ఫైర్

ఆర్మీకి ఏపీ సర్కారు హామీ..
ఏపీ వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్సు కాంప్లెక్సుల్లో డిఫెన్సు క్యాంటీన్, వెటర్నన్స్ ఆసుపత్రి, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు, సైనిక్ అతిధిగృహం వంటివి సదుపాయాలను ఏర్పాటు చేస్తామని మేజర్ జనరల్ ఆర్కే సింగ్ గుర్తు చేశారు. అందుకు సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పందిస్తూ.. అవసరమైన స్థలాలను గుర్తించి కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తొందర్లోనే జిల్లా కలక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎస్ ను కలిసిన సమయంలో సింగ్ వెంట రిటైర్డ్ కల్నల్ రాంబాబు తదితరులు కూడా ఉన్నారు.