అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

500 ప్రైవేట్ వాహనాల సీజ్, పండుగకు 3 లక్షల మంది, చార్జీ బాదితే బస్సుల సీజ్: మంత్రి పేర్ని నాని

|
Google Oneindia TeluguNews

Recommended Video

Perni Nani Warns To Private Bus Operators On Collecting Excess Charges ! || Oneindia Telugu

ప్రైవేట్ బస్సుల దోపిడీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగిస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను తుంగలో తొక్కిన 500 బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చే ప్రయాణికులను దోపిడీ చేస్తామంటే ఉపేక్షించబోమని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.

3.13 లక్షల మంది..

3.13 లక్షల మంది..

ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతి పండగకు ఏపీకి 3 లక్షల 13 వేల 500 మంది వచ్చారని మంత్రి పేర్ని నాని తెలియజేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగజేయకుండా రవాణా సౌకర్యం అందించామన్నారు. సంక్రాంతి పండగ కోసం 4200 స్పెషల్ బస్సులు నడపాలని అనుకొన్న.. 2945 బస్సులను మాత్రమే తిప్పామని చెప్పారు. ఆయా బస్సుల ద్వారా 2 లక్షల 10 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు.

1.3 లక్షల మంది

1.3 లక్షల మంది

రెగ్యులర్ బస్సుల్లో లక్షా 3 వేల 500 మందిని సొంత ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే రెగ్యులర్ బస్సులు 7 వేల మందిని ఎక్కువగా తీసుకొచ్చామని చెప్పారు. స్పెషల్ బస్సుల ద్వారా 20 వేల పైచిలుకు ప్రయాణికులను తరలించామని చెప్పారు. తిరుగు ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్ని నాని తెలిపారు. 3 వేల స్పెషల్ బస్సులను సిద్ధంగా ఉంచామని చెప్పారు.

 ఫిర్యాదు చేయండి..

ఫిర్యాదు చేయండి..


ఒంగోలు-బెంగళూరు మధ్య టికెట్ చార్జీ ఎక్కువగా తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు. అధిక చార్జీ అడిగితే 830988 7955 నంబర్ వాట్సాప్ చేయాలని, లేదంటే స్కిన్ షాట్ తీసి పంపించాలని కోరారు. వెంటనే బ్రేక్ ఇన్ స్పెక్టర్ స్పందిస్తారని.. తగిన చర్యలు తీసుకుంటారన్నారు.

English summary
500 buses are seize minister perni nani said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X