గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలులో డబల్ సెంచరీ: కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు: 800 మార్క్‌ జంప్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణకు బ్రేకులు పడట్లేదు. లాక్‌డౌన్ కొనసాగిస్తోన్నప్పటికీ.. కొత్త కేసులు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన రికార్డుస్థాయిలో 75, ఆ మరుసటి రోజు 35 కేసులు నమోదైన వేళ.. కొత్తగా మరో 56 మందిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు అధికారులు. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరింది. 24 గంటల వ్యవధిలో 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు.

కన్నా..కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?: సాయిరెడ్డి సింగిల్ లైన్ పంచ్: వైరస్ కంటే వేగంగా..కన్నా..కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?: సాయిరెడ్డి సింగిల్ లైన్ పంచ్: వైరస్ కంటే వేగంగా..

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే అత్యధికంగా రికార్డు అయ్యాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 19 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు-6, కడప-5, ప్రకాశం-4, కృష్ణా-3 కేసులు నమోదైనట్లు కోవిడ్-19 నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. కొత్తగా కరోనా వైరస్ వల్ల ఇద్దరు మరణించారని, దీనితో మృతుల సంఖ్య 24కు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటిదాకా 120 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు చెప్పారు.

56 New COVID-19 cases have reported in Adhra Pradesh. total cases registered as 813

ఫలితంగా- కర్నూలు జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య డబుల్ సెంచరీని దాటింది. మొత్తంగా 203 కేసులు నమోదు అయ్యాయి ఈ రాయలసీమ జిల్లాలో. నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లి, కోవెలకుంట్ల వంటి పట్టణాల పరిధిలో పాజిటివ్ కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటిదాకా అయిదుమంది వైరస్ వల్ల మరణించగా నలుగురు డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 194.

కర్నూలు తరువాత అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జాబితాలో గుంటూరు రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 177 మంది వైరస్ బారిన పడ్డారు. యాక్టివ్ కేసులు 146. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 23కు చేరుకోగా.. ఎనిమిది మంది ఇప్పటిదాకా ఈ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలవారీగా అనంతపురం-36, చిత్తూరు-59, తూర్పు గోదావరి-26, గుంటూరు-177, కడప-51, కృష్ణా-86, కర్నూలు-203, నెల్లూరు-67, ప్రకాశం-48, విశాఖపట్నం-21, పశ్చిమ గోదావరి-39 కేసులు ఉన్నాయి.

Recommended Video

Doctors Declare April 23 As Black Day | ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే దాడులు చేస్తారా ?

English summary
56 New COVID-19 cases have reported in Adhra Pradesh. Total cases has increased in the State as 813 and 2 more death reported in State. Highest Coronavirus Positive cases raised in Kurnool distrct as 203 and Guntur district registered as 177.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X