వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్య పెళ్ళికొడుకు: ఏడు పెళ్ళిళ్ళు చేసుకొన్న వ్యక్తి, ఏడో భార్యకు వేధింపులు, నిరసన

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: ఏకంగా ఏడు పెళ్ళిళ్ళు చేసుకొన్న ఓ వ్యక్తి ఏడో భార్యను కూడ వేధింపులకు పాల్పడుతున్నాడు. అయితే ఈ విషయమై ఈ వేధింపులు భరించలేక బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతును ప్రకటించాయి.

ఏడు పెళ్ళిళ్ళు చేసుకొన్న ఓ వ్యక్తి ఈ విషయాలన్నీ తెలిసి కూడ భర్తతో కాపురం చేస్తున్న ఏడో భార్యను వేధింపులకు గురి చేశాడు. అంతేకాదు ఇస్తానని హామీ ఇచ్చిన ఆస్తులు ఇవ్వకుండానే బంధువులతో తనపై దాడి చేయించాడని ఏడో భార్య ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి పరిధిలోని మట్టావాని‌చెరువుకు చెందిన ఆంజనేయులుకు జంగారెడ్డిగూడెంకు చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి నాలుగేళ్ళ కుమారుడు కూడ ఉన్నాడు తనతో భర్త గొడవపడడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు తెలిసి రెండు వివాహాలు చేసుకోగా, గ్రామస్థులకు తెలియకుండా ఐదు వివాహాలు చేసుకొన్నాడు.అయితే ఒక్క పెళ్ళి విషయం మరోకరికి తెలియుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. 60 ఏళ్ళలో ఏడు పెళ్ళిళ్ళు చేసుకొని దర్జాగా జీవనం సాగిస్తున్నాడు ఆంజనేయులు.

ఏడో భార్యకు కూడ వేధింపులు

ఏడో భార్యకు కూడ వేధింపులు

ఆంజనేయులు ప్రతి రోజూ తన భార్య లక్ష్మితో గొడవ పడేవాడు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి.దీంతో అసలు విషయాన్ని లక్ష్మీ ఆరాతీస్తే షాక్‌కు గురైంది తాను ఆంజనేయులుకు ఏడో భార్యగా తెలుసుకొంది. దీంతో ఆమె ఆందోళనకు దిగింది. దీంతో అరెకరం వరి చేను, ఇంట్లో వాటా ఇచ్చేందుకు ఆంజనేయులు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకొన్నాడని బాధితురాలు లక్ష్మి తెలిపారు.

లక్ష్మికి వేధింపులు

లక్ష్మికి వేధింపులు

అయితే పెద్దల సమక్షంలో ఒప్పుకొన్నట్టుగానే పొలాన్ని లక్ష్మి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ, ఇంట్లో ఉండడం కుదరదని ఆంజనేయులు తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఆమె గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో అతను గ్రామం నుండి పారిపోయాడు.

 తనపై ఆంజనేయులు బంధువుల దాడి

తనపై ఆంజనేయులు బంధువుల దాడి

చేతికొచ్చిన పంటను కోసుకొనేందుకు వెళ్ళిన తనపై ఆంజనేయులు బంధువులు దాడి చేశారని లక్ష్మి ఆరోపిస్తున్నారు. తన పొలంలో తన పంటను తీసుకోకుండా అడ్డుపడడంపై ఆమె మండిపడుతున్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

ఆంజనేయులు ఇంటి ఎదుట లక్ష్మి ధర్నా

ఆంజనేయులు ఇంటి ఎదుట లక్ష్మి ధర్నా

తనకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో వివాహిత లక్ష్మి ఆంజనేయులు ఇంటి ముందు ధర్నాకు దిగింది. అంతేకాదు ఆంజనేయులు బంధువులు కూడ దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.బాధితురాలు లక్ష్మికి స్థానిక మహిళా సంఘాలు అండగా నిలిచాయి.

English summary
In Mattacani Chervu of Burugupalli Panchayat, West Godavari district a strange incident is reported according to which a 60-year-old man held seven marriages. A man called Chelluboina Anjaneyulu is a farmer having 6 acres of land had mother, 3 sisters and 2 sons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X