హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా పంజా .. 62 కొత్త కేసులు.. 1500 దాటిన కరోనా పాజిటివ్ బాధితులు

|
Google Oneindia TeluguNews

ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతుంది. తాజా బులిటెన్ ప్రకారం మొత్తం ఇప్పటి వరకు 1525 కేసులు నమోదు కాగా . 441 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . 33 మంది మృతి చెందారు . ప్రస్తుతం 1051 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసు సంఖ్య ఎక్కువగా ఉన్న కర్నూలు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.

Recommended Video

AP Corona Cases Crossed 1500 With 62 New Positive Cases in 24 hours | Oneindia Telugu

 కరోనా ఎఫెక్ట్ ... అక్కడ ఏసీలకు బదులు ఫ్యాన్లు .. రీజన్ ఇదే !! కరోనా ఎఫెక్ట్ ... అక్కడ ఏసీలకు బదులు ఫ్యాన్లు .. రీజన్ ఇదే !!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో ప్రజల్లో భయాందోళన మరింత పెరుగుతుంది. ఒకపక్క కేంద్ర మార్గ దర్శకాలతో వస్తున్న వలస కార్మికులు, విద్యార్థుల విషయంలో కూడా ఆందోళన నెలకొంది . ఈ మధ్య ఏరోజు తీసుకున్న 50కి తగ్గకుండా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక, తాజాగా గడచినా 24 గంటల్లో కొత్తగా 62 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కరోనాకు సంబంధించి అధికారికంగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1500 దాటిపోయినట్లు తెలుస్తుంది.

62 new cases in AP.. Corona Positive Victims crossed 1500

ఇక తాజాగా నమోదైన కేసులను జిల్లాల వారీగా గమనిస్తే రాష్ట్రంలోనే టాప్ 1 గా ఉన్న కర్నూలులో పెద్ద సంఖ్యలో కొత్తకేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 25 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటించారు. నెల్లూరులో 6, కృష్ణా జిల్లాలో 12, అనంతపురం, కడప, విశాఖపట్నంలో 4 చొప్పున, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో ఒక్కో కేసు చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 436 కేసులతో కర్నూలు అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గుంటూరు 308 కేసులతో రెండో స్థానంలో ఉంది . ఇక కృష్ణాలో 258, నెల్లూరులో 90, కడపలో 83 కేసులు కరోనా పాజిటివ్‌ గా నమోదు అయ్యాయి. బాగా పెరుగుతున్న కేసులకు తగ్గట్టు ప్రభుత్వం వైద్య సదుపాయాలను కల్పిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది.

English summary
The number of corona positive cases increases in AP. According to the latest bulletin, there have been 1525 corona positive cases so far. A total of 62 positive cases have been registered in last 24 hours officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X