వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షేమానికి 65 వేల కోట్లు : 2.26 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌: శాఖ‌ల వారీగా కేటాయింపులు ఇలా..!

|
Google Oneindia TeluguNews

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టా రు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అలాగే పలు కొత్త పథకాలకు ప్రభు త్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయ నుంది. దీంతో పాటుగా గ‌తంలో ఉన్న కేటాయింపుల కంటే పెద్ద మొత్తంలో ఈ సారి సంక్షేమ రంగానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా స్ప‌ష్టం అవుతోంది.

కీల‌క కేటాయింపులు..

కీల‌క కేటాయింపులు..

ఆయా రంగాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ప‌రిశీలిస్తే..ప్ర‌ధానంగా అన్ని శాఖ‌ల కంటే వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు కేటాయించారు. ఆ త‌రువాత బీసీ వెల్ఫేర్‌ రూ.8,242 మేర నిధులు కేటాయింపులు చేసారు. ఇక‌, అటవీపర్యా వరణానికి రూ. 491 కోట్లు మంజూరు చేసారు. ఏపిలో ఉన్నత విద్య- 3,171 కోట్లు ప్ర‌తిపాదించారు. ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473 ప్ర‌తిపాద‌లు ఇచ్చారు. ఇక, సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783 కోట్లు ప్ర‌తిపాదిస్త‌న్న‌ట్లు గా బ‌డ్జెట్ ప్ర‌సంగంలో య‌న‌మ‌ల స్ఫ‌ష్టం చేసారు. పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం. కీల‌క‌మైన
ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు కేటాయిస్తూ బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాద‌న‌లు సమ‌ర్పించారు. ఇక‌, సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117 కేటాయింపులు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇరిగేష‌న్ కు 16 వేల కోట్లు..

ఇరిగేష‌న్ కు 16 వేల కోట్లు..

ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌జారోగ్యంతో సంబంధం ఉన్న కీల‌క‌మైన వైద్యారోగ్యశాఖకు రూ. 10,032 కోట్లు కేటాయించారు. హోం శాఖ కు రూ.6,397 కోట్లు ప్ర‌భుత్వం కేటాయించింది. ఇక‌, ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న గృహనిర్మాణశాఖకు రూ.4079 కోట్ల మేర కేటాయింపులు జ‌రిగాయి. ఏపి ప్ర‌భుత్వం పోల‌వ‌రం తో పాటుగా 52 ప్రాజెక్టుల‌ను పూర్తి చేట‌య‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు ప్రాధాన్య‌త ఇస్తూ జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు భారీ కేటాయింపులు చేసింది. మ‌రో కీల‌క రంగ‌మైన పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు, ఐటీకి 1006 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు చొప్పున కేటాయింపులు చేసింది. న్యాయశాఖకు 918 కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం..అసెంబ్లీకి 149 కోట్లు,
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు, ఇక‌, మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రో ముఖ్య విభాగ‌మైన ప్లానింగ్‌కు 1403 కోట్లు మేర కేటాయింపులు చేసారు.

గ్రామీణాభివృద్దికి 35 వేల కోట్లు..

గ్రామీణాభివృద్దికి 35 వేల కోట్లు..

ఏపిలో వ‌చ్చే ఆర్దిక సంవ‌త్సారానికి సంబంధించి బ‌డ్జెట్ లో పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కో ట్లు మేర కేటాయింపులు చేసారు. ఇక‌, కీల‌క‌మైన రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు మేర కేటాయింపులు ఇచ్చారు. ఇక‌,
రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ 172 కోట్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 458 కోట్లు కేటాయించారు. ప్ర‌భుత్వం సాంఘిక సంక్షేమం కోసం ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా..సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు కేటాయించింది. రోడ్లు భవనాల శాఖ కు రూ. 5382 కోట్లు, మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు మేర కేటాయింపులు జ‌రిగాయి. యువజన క్రీడలు రూ. 1982 కోట్లు ,చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు , డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు, మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు, పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు, బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు, ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు, పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతు వులకు రూ. 10,401 కోట్లు చొప్పున కేటాయింపులు చేస్తూ తమ ప్రాధాన్య‌త‌ల‌ను చాటుకున్నారు.

English summary
In 2019-20 AP Budget Govt give given priority for welfare and irrigation and agriculture. Total estimated 2.26 lac cr of budget for next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X