వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7.5 లక్షల సైకిళ్లు ఇవ్వాలని బాబు, ట్యాబ్‌లు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు సైకిళ్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడుతున్నారు. అలాగే అధికారులు అందరికీ ట్యాబ్‌లు (మినీ కంప్యూటర్లు) అందించాలనీ నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దీనికి సంబంధించి ఆర్ధిక శాఖ ఫైళ్లు సిద్ధం చేసింది.

మొత్తం బాలికలకు ఏడున్నర లక్షల సైకిళ్లు, అధికారులకు పది వేల ట్యాబ్ కంప్యూటర్లను అందించాలని నిర్ణయించారు. ఎనిమిది నుంచి టెన్త్ చదువుతున్న బాలికలకు సైకిళ్లు అందించనున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే అంశంపై హామీ ఇచ్చారు. మొత్తం సైకిళ్లకు దాదాపు 10 కోట్లు ఖర్చవుతుందని ఆర్ధిక శాఖ అంచనా వేస్తోంది.

7.5 lakh bikes for students in Andhra Pradesh soon

సైకిళ్లను జన్మభూమి సందర్భంగా ఆమోదించాలా? లేక మరో ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందించాలా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదంటున్నారు. ఇక పేపర్‌లెస్ పాలనపై దృష్టి పెడుతున్న చంద్రబాబు అధికారులకు కూడా ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించారు.

రాష్టస్థ్రాయి నుంచి మండలస్థాయి వరకూ అధికారులకు ట్యాబ్‌లు అందించేందుకు మరో 20 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మంత్రులకు ఐపాడ్లు అందించి పేపర్‌లెస్ కేబినెట్ భేటీ నిర్వహించిన బాబు, ఇప్పుడు అధికారులకూ అదే తరహాలో ట్యాబ్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగులు అందరికీ ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించారు.

English summary

 The Telugu Desam-led Andhra Pradesh government has decided to buy 7.5 lakh bicycles to distribute to girl students in the state, keeping in mind its election manifesto, in which it had promised bicycles to eighth, ninth and tenth standard girls, if they came to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X