వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

71వ రోజు రాజధాని ఆందోళనలు .. కీలక నేతలు ఆ దిక్కైనా చూడట్లేదుగా !!

|
Google Oneindia TeluguNews

రాజధాని కోసం రైతులు రోజు రోజుకూ తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నా రాజకీయ పార్టీల నుండి బడా నేతలు ఎవరూ రాజధాని రైతుల వంక చూడటం లేదు. మొదట్లో ప్రతి ఒక్కరు రాజధాని రైతుల కోసమే తమ పోరాటం అని చెప్పారు. ఒకరికి పది మంది నేతలు అమరావతి గ్రామాల్లో పర్యటించారు . కానీ ఇప్పుడు నేతలు ఎవరూ రాజధాని గ్రామాల వంక చూడకపోవటం రైతులకు తీవ్ర నిరాశని కలిగిస్తుంది.

టార్గెట్ అమరావతి .. రాజధాని భూములపై ఏపీ సర్కార్ వివాదాస్పద నిర్ణయంతో రగడటార్గెట్ అమరావతి .. రాజధాని భూములపై ఏపీ సర్కార్ వివాదాస్పద నిర్ణయంతో రగడ

రాజధాని గ్రామాల వంక చూడని రాజకీయ పార్టీల నాయకులు

రాజధాని గ్రామాల వంక చూడని రాజకీయ పార్టీల నాయకులు

ఒక పక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని గ్రామాల్లోని భూములను నిరుపేదలకు పంచేందుకు యత్నం చెయ్యటం , కొన్ని రాజధాని గ్రామాలను తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో కలపటం వంటి అంశాలు రాజధాని రైతుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే క్రమంలోనే ప్రభుత్వం చేసినట్టుగా రాజధాని ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల నుండి నాయకులెవరూ పెద్దగా రాజధాని గ్రామాల్లో పర్యటించకున్నా సరే రాజధాని ప్రాంత రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

71వ రోజుకు చేరుకున్న అమరావతి గ్రామాల ఆందోళనలు

71వ రోజుకు చేరుకున్న అమరావతి గ్రామాల ఆందోళనలు

మూడు రాజధానులు వద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 71వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక వెలగపూడిలో 71వ రోజు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతుల ధర్నాలు చేస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Recommended Video

Nandigam Suresh Says No Farmers Only Paid Artists In Capital Dharna | Oneindia Telugu
 కోర్టులను ఆశ్రయిస్తూనే, పోరాటాలు చేస్తున్న రైతులు

కోర్టులను ఆశ్రయిస్తూనే, పోరాటాలు చేస్తున్న రైతులు

మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేస్తున్నారు.ఇక రాజధాని ప్రాంత రైతులు 71 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ వైఖరి మాత్రం అలాగే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఇక ప్రభుత్వ తీరుపై, రాజధాని తరలింపుపై రైతులు అటు కోర్టులను ఆశ్రయిస్తూనే, ఇటు పోరాటాలు చేస్తున్నారు.

English summary
The agitations for the capital amaravati reached the 71st day. The dharna is being held in Thullur. On the 71st day of the Velagapudi sitrikes continues. Farmers' dharnas are being performed in Penumaka,Krishnayapalem, Raayapudi, Nelapadu, Pedaparimi and Thadikonda. Farmers' concerns are continuing in other capital villages as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X