తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో కరోనా కలకలం: 743 మందికి పాజిటివ్, ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు అర్చకులు, అధికారులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ మినహాయింపుల నేపథ్యంలో తిరుమల దేవస్థానంకు భక్తులను అనుమతించారు.

Recommended Video

TTD Issued Guidlines For devotees To Visit Tirumala From June 8
తిరుమలలో 743 మందికి కరోనా పాజిటివ్..

తిరుమలలో 743 మందికి కరోనా పాజిటివ్..

డయల్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీల్ కుమార్ సింగ్ జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జూన్ 11 నుంచి ఇప్పటి వరకు 743 మంది(అర్చకులు, టీటీడీ సిబ్బంది) కరోనా బారిన పడ్డారు. 402 మంది కోలుకున్నారు. 338 మంది టీటీడీ సిబ్బంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.వీరంతా శ్రీనివాసమ్, విష్ణునివాసం, మాధవమ్ లను కరోనా కేంద్రాలుగా మార్చారు.

కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో..

కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో..

తిరుమలలో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే కరోనా బారిన పడి మరణించారని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శనాలతోనే తాము జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలు ప్రారంభించినట్లు తెలిపారు. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై అందరూ సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. భక్తుల రాక కొనసాగుతోందని అన్నారు.

ఒక్క తిరుపతిలోనే కాదు..

ఒక్క తిరుపతిలోనే కాదు..

కరోనా కట్టడిలో భాగంా కళ్యాణ కట్టా, లడ్డూ, అన్నప్రసాదమ్ లాంటి ప్రసాదాలను టీటీడీ అందిస్తోందని తెలిపారు. ఒక్క తిరుపతిలోనే కరోనా కేసులు లేవని, రాష్ట్రం, దేశంలో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. జులైలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినవారి సంఖ్య 2.38 లక్షల మంది భక్తులకు చేరింది.

చిత్తూరులో భారీగానే కేసులు

చిత్తూరులో భారీగానే కేసులు

ఇక చిత్తూరు జిల్లాలో 848 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం పాజివ్ కేసుల సంఖ్య 17,097కు చేరింది. 7084 యాక్టివ్ కేసులున్నాయి. 9842 మంది కోలుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే .తాజాగా, 10,820 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 87,112 ఉణ్నాయి. 1,38,712 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2036 మంది కరోనా బారిన పడి మరణించారు.

English summary
743 TTD staff test positive for COVID-19, three have succumbed: official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X