• search
 • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీకి షాక్: మరో 8 ఎమ్మెల్యేలు జంప్? వైసీపీ నల్లపురెడ్డి సంచలనం.. జనసేనలోకి పరిటాల ఫ్యామిలీ?

|

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చుట్టూ కొనసాగుతోన్న రాజకీయ క్రీడ క్లైమాక్స్‌కు వచ్చేసిందా? లాక్‌డౌన్ గేట్లు పూర్తిగా ఎత్తేసిన తర్వాత చంద్రబాబు తన ప్రతిపక్ష హోదా కోల్పోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సాక్ష్యాత్తూ అధికార పార్టీ ముఖ్యనేతలే చెబుతుండటం ఊహాగానాలక మరింత బలం చేకూరినట్లయింది. టీడీపీకే చెందిన పరిటాల కుటుంబం సైతం పార్టీని వీడబోతున్నారనే ప్రచారం ఏపీలో జోరుగా సోగుతోంది.

కలకలం రేపిన కోవూరు ఎమ్మెల్యే..

కలకలం రేపిన కోవూరు ఎమ్మెల్యే..

కోవూరు నియోజకవర్గంలో పేదలకు సరుకులు, కూరగాయలు పంచడంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకొద్ది రోజుల్లోనే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా ఊడుతుందని, గతంలో వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలకుతోడు మరో 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉన్నారని, జగన్ గేట్లు ఎత్తేసిన మరుక్షణమే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం గనుక సరేనంటే మరుక్షణంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతైపోతుందని అన్నారు.

బేసిగ్గా శాడిస్టు.. ఇప్పుడు మతిభ్రమణం..

బేసిగ్గా శాడిస్టు.. ఇప్పుడు మతిభ్రమణం..

‘‘రైతుల గురించి మాట్లాడే అర్హత కూడా లేని చంద్రబాబు.. వ్యవసాయదారుల్ని జగన్ మోసం చేస్తున్నాడని విమర్శించడమా? కరోనాకు భయపడి హైదరాబాద్ పారిపోయిన నువ్వు అన్నీ మూసుకుని అక్కడే కూర్చో. నాడు వైఎస్సార్, నేడు జగన్ రైతులకు మేలు చేసింది ఈ ఇద్దరే. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు కూడా ఖాతాల్లో జమ చేశాం. ప్రజలైతే చంద్రబాబుకు గట్టిగానే బుద్ధి చెప్పారు. అయినాసరే ఆయన మారడు. కొందరి బతుకులంతే. అవతలివాళ్లు బాగుపడితే ఓర్వలేని తనం కాబట్టే బాబు ప్రతిరోజూ ఏదో ఒకటి వాగుతుంటాడు. బేసిగ్గా ఆయనొక శాడిస్టు.. కరోనా దెబ్బకు ఇప్పుడు మతిభ్రమించింది''అని ప్రసన్న కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. అంతలోనే..

అంతలోనే రాజీనామా చేస్తానంటూ..

అంతలోనే రాజీనామా చేస్తానంటూ..

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, ముదువర్తిపాలెంలో మరో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. సబ్ మెర్సిబుల్ కాజ్‌వే నిర్మాణంపై టీడీపీ నేతల విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. కరోనా కారణంగా కాజ్ వే ఫైలు పెండింగ్ లో పడిందని, అతి త్వరలోనే ప్రొసీడిగ్స్ తెర్పించి, టెండర్లు కూడా పిలుస్తామని, ఒకవేళ ఆ పని చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నల్లపురెడ్డి అన్నారు. ఇది జనాన్ని మభ్యపెట్టడానికి చెబుతున్న మాట కాదని, పాదయాత్ర సమయంలో జగన్ కూడా కాజ్ వేపై హామీ ఇచ్చారని, ఎట్టిపరిస్థితుల్లోనూ పని చేసి చూపిస్తానని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. మరోవైపు..

  Andhra Pradesh Government Arranges Transport For Migrants
  పరిటాల ఫ్యామిలీ దారెటు?

  పరిటాల ఫ్యామిలీ దారెటు?

  టీడీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతుండగానే, అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల కుటుంబంపై సోషల్ మీడియాలో చర్చ తారాస్థాయికి చేరింది. పరిటాల ఫ్యామిలీ టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. నిజంగా వాళ్లు పార్టీ మారుతున్నారనడానికి ఆధారాలుగానీ, అధికారిక ప్రకటనలుగానీ లేవు. అయితే, ఉన్నట్టుండి ప్రచారం ఊపందుకోవడం, ఇప్పటిదాకా దీనిపై ఖండనలు కూడా రాకపోవడం ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. గతంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అనంతపురంలోని పరిటాల ఇంటికి వెళ్లి మాటమంతి జరపడం తెలిసిందే. దివంగత పరిటాల రవి కీలక అనుచరుల్లో కొందరు ఇప్పటికే పవన్ పార్టీలో చేరారు.

  English summary
  kovur mla nallapureddy prasanna kumar redy said that eight of opposition tdp mlas are in touch with ruling ysrcp. he slams chandrababu over farmers and coronavirus issues. speculations on paritala family too rusks on social media
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more