వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి నిధుల బ్రేక్‌కు కారణమిదే, పవన్ ఏం చేస్తాడో తెలియదు: మాణిక్యాలరావు షాకింగ్ కామెంట్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్రంలో అవినీతి చోటు చేసుకొందనే ఉద్దేశ్యంతోనే కేంద్రం నుండి నిధులు రావడం లేదని ప్రజలు అనుకొంటున్నారని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు.

ఆ భ్రమతోనే టిడిపి ఎన్డీఏకు గుడ్‌బై, రూ.15వేల కోట్ల ప్యాకేజీ తీసుకోవడం లేదు: హరిబాబుఆ భ్రమతోనే టిడిపి ఎన్డీఏకు గుడ్‌బై, రూ.15వేల కోట్ల ప్యాకేజీ తీసుకోవడం లేదు: హరిబాబు

Recommended Video

టీడీపీ, వైసీపీలు మోడీకి వత్తాసు : రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం

మాజీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంగళవారం నాడు అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.

ఢిల్లీకి బాబు: బిజెపియేతర పార్టీలతో మీటింగ్, ఏం జరుగుతోంది?ఢిల్లీకి బాబు: బిజెపియేతర పార్టీలతో మీటింగ్, ఏం జరుగుతోంది?

ఏపీలో బిజెపి, టిడిపి నేతల మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోయాయి. ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. కేంద్రంపై టిడిపి అవిశ్వాసం కూడ పెట్టింది. ఈ తరుణంలో ఏపీలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.

మెజారిటీ కాపులు పవన్ వైపే

మెజారిటీ కాపులు పవన్ వైపే

ఏపీ రాష్ట్రంలో 80 శాతం కాపులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ కాపులను ఎలా వినియోగించుకొంటారో తెలియదన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్నారు.

కర్ణాటకకు టిడిపి టీమ్ లు

కర్ణాటకకు టిడిపి టీమ్ లు

కర్ణాటక రాష్ట్రానికి ఏపీ నుండి టిడిపి కొన్ని టీమ్‌లను పంపిందని బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేసేందుకు టిడిపి ఈ టీమ్‌లను పంపిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుకే నిదులు రావడం లేదు

అందుకే నిదులు రావడం లేదు

ఏపీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకొందని, ఈ కారణంగానే ఏపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని మాజీ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. అవినీతికి దూరంగా ఉంటే రాష్ట్రానికి నిధులు వచ్చేవనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని ఆయన చెప్పారు.

బిజెపి, టిడిపి మధ్య మాటల సవాళ్ళు

బిజెపి, టిడిపి మధ్య మాటల సవాళ్ళు

టిడిపి , బిజెపిల మధ్య మాటల యుద్దాలు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తున్న సమయంలో కూడ ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. పొత్తు తెగిన తర్వాత విమర్శల తీవ్రత మరింత పెరిగింది.

English summary
Bjp Mla Manikyala Rao said that 80 percent of Kapu caste people along with pawan kalyan. He chit chat with media at Amaravathi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X