ఏపీలో కరోనా: ఊరటనిస్తున్నా ఆందోళనకరంగానే కేసులు, జిల్లాలవారీగా తగ్గని తీవ్రత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసుల ఉధృతి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా 10 వేల కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, దేశంలోని రెండు మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉండటం గమనార్హం.
ఏపీలో కరోనా: కొత్త కేసుల కంటే ఎక్కువే కోలుకున్నారు, జిల్లాల వారీగా కేసులు

ఏపీలో ఆరు లక్షలకు చేరువలో కరోనా కేసులు
గత 24 గంటల్లో 75,013 నమూనాలను పరీక్షించగా 8835 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,92,760కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 64 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5105కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా మరణాలు..
జిల్లాల్లా వారీగా మరణాల సంఖ్యను గమనించినట్లయితే.. అత్యధికంగా చిత్తూరులో 9 మంది, నెల్లూరులో 7, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణాలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యధిక కేసులు
ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఉన్నాయి. జిల్లాల వారీగా కేసులు అనంతపురం జిల్లాలో 725, చిత్తూరులో 798,
తూర్పుగోదావరిలో 1421, గుంటూరులో 685, కడపలో 536, కృష్ణాలో 396,
కర్నూలులో 424, నెల్లూరులో 562, ప్రకాశంలో 873, శ్రీకాకుళంలో 495, విశాఖపట్నంలో 325, విజయనగరంలో 544, పశ్చిమగోదావరిలో 1051 నమోదయ్యాయి.

ఓ వైపు ఏపీ కోలుకుంటున్నట్లు కనిపించినా..
గత 24 గంటల్లో 10,845 మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. ఇది నమోదైన కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48,06,879 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90,279 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,97,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నప్పటికీ.. కొత్త కేసులు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. దేశంలో మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధిక కేసులున్నాయి. అత్యధిక యాక్టివ్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఏపీ ఉంది.