వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం : రైతుల‌కు 9 గంట‌ల ఉచిత విద్యుత్..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్‌ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్‌ శాఖ ముఖ్య కార్య దర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు.

9 గంటల ఉచిత విద్యుత్‌
రైతుల‌కు 9 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ‌..టిడిపి ప్ర‌భుత్వం దీని అమ‌లుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు గంట‌ల ఉచిత విద్యుత్ ను 9 గంట‌ల‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర‌కు కొద్ది రోజుల క్రిత‌మే ముఖ్య‌మంత్రి ప్ర‌క ట‌న చేసారు. ఇప్పుడు ఉత్త‌ర్వులు జారీ చేసారు. అయితే, ఈ ఉత్త‌ర్వుల్లో ఈ నిర్ణ‌యం ఎప్ప‌టి నుండి అమ‌ల‌య్యేదీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇప్ప‌టికే అన్న‌దాత సుభీభ‌వ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వ సాయంతో క‌లిపి ప‌దివేలు చొప్పున ఇవ్వా ల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి క్యాబినెట్ లో నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, రైతుల‌కు పోస్ట్ డేట్ చెక్కులు ఇవ్వాల‌ని భావించినా..అది ఎటువంటి ప్ర‌భావం చూపిస్తుందో అనే మీమాంస ప్ర‌భుత్వంలో క‌నిపి స్తోంది. దీంతో..దీని పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.

9 Hours Free power in AP : 100 Units Free for EBCs..

ఎంబీసిల‌కు వంద యూనిట్లు ఉచితం..
ఏపిలోని దారిద్రరేఖకు దిగువన ఉండే అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ)కు చెందిన కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు ఆమోదం తెలుపుతూ విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ మరో ఉత్తర్వు జారీ చేశారు. రజకుల లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకు, నగల తయారీ వృత్తిదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను బీసీ సంక్షేమ శాఖ విద్యుత్‌ శాఖకు చెల్లించా ల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఇది కూడా గ‌తంలో ఇచ్చిన హామీ అయినా..ఎన్నిక‌ల ముందు నిర్ణ‌యం తీసుకోవ‌టం పై చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
AP govt announced another key decision before elections. Govt decided to give 9 hours free power for farmers in AP. At the same time govt issued G.O on up to 100 units of power free for MBC sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X