వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు: 87 మంది మృతి, ఆ రెండు జిల్లాలో అత్యధికం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి 10వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 9024 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 58,315 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది.

ఏపీలో రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు..

ఏపీలో రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు..


తాజాగా నమోదైన 9024 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,44,549కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 87,597 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,54,749 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క రోజులో 9113 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో25,92,619 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

ఆ రెండు జిల్లాల్లో అత్యధిక కేసులు.. కొత్తగా 87 మరణాలు..

ఆ రెండు జిల్లాల్లో అత్యధిక కేసులు.. కొత్తగా 87 మరణాలు..

తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 1372, కర్నూలు జిల్లా నుంచి 1138 కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో 87 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాలో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో 9 మంది, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు, కపడ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు, తూర్పుగోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2203కి చేరారు.

జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు

జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు


తాజాగా, నమోదైన కేసుల్లో జిల్లా వారీగా.. అనంతపురంలో 959, చిత్తూరులో 758, తూర్పుగోదావరి 1372, గుంటూరులో 717, కడపలో 579, కృష్ణాలో 342, కర్నూలులో 1138, నెల్లూరులో 364, ప్రకాశంలో 343, శ్రీకాకుళంలో 504, విశాఖపట్నంలో 676, విజయనగరంలో 594, పశ్చిమగోదావరి జిల్లాలో 678 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Recommended Video

Fact Check : Indian Railways Clarifies No New Circular Issued On Suspension Of Train Services
మూడో స్థానంలో ఏపీ.. దేశంలో భారీగా కేసులు

మూడో స్థానంలో ఏపీ.. దేశంలో భారీగా కేసులు

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 22,94,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
6,44,249 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 16,04,119 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి 45,597 మంది మరణించారు.

English summary
9024 new corona cases reported in Andhra Pradesh: 87 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X