• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘‘టీడీపీకి చెమటలు, 98 శాతం వ్యతిరేకమే, జగన్ పడే కష్టంలో 5 శాతం పడినా.. అధికారం మనదే..’’

By Ramesh Babu
|
  భారతదేశంలోనే అతి పెద్ద ప్రతిపక్షం YSRCP | Oneindia Telugu

  కడప: రాష్ట్రంలో అధికార తెలుగుదేశంపై 98 శాతం మంది వ్యతిరేకతతో ఉన్నారని, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పడుతున్న కష్టంలో 5 శాతం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పడినా అధికారం సొంతం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.

  జగన్ కేసు: మీతో విసిగిపోయాను.. ఇంకెంత కాలమిలా? లాయర్ పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం

  నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కడప పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా మేయర్‌ సురేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాధరెడ్డి, అంజద్‌బాష, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు.

  చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతే...

  చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతే...

  ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతే వైసీపీని గెలిపిస్తుందన్నారు. త్వరలోనే సమర భేరి మోగే అవకాశముందని, బ్యాలెట్‌ యుద్ధానికి సంసిద్ధులమవుదామని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలంటూ నేతలకు, కార్యకర్తలకు ఆయన కోరారు. రాష్ట్రంలో సర్పంచ్‌ నుంచి ఎంపీ వరకు ఏ ఒక్కరికైనా ప్రజాస్వామ్యపరమైన అధికారం ఉందా? అని రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఇదే సరైన సమయమని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

  వైసీపీకి కార్యకర్తలే అండ...

  వైసీపీకి కార్యకర్తలే అండ...

  ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి మాట్లాడుతూ వైసీపీ భారతదేశంలోనే అతి పెద్ద ప్రతిపక్షమని, దివంగత ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమ.. వైఎస్‌ జగన్‌పై ఉన్న విశ్వాసంతో అధికారంలో లేకపోయినా కార్యకర్తలు వైసీపీ వెంటే ఉన్నారని అన్నారు. కార్యకర్తల అండ ద్వారానే వైసీపీ నడుస్తుందన్నారు.

  జగన్ మాట ఇచ్చారంటే...

  జగన్ మాట ఇచ్చారంటే...

  ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను ఒక్కో జిల్లా చేస్తామని తమ అధినేత జగన్ మాట ఇచ్చారన్నారు. ఆ మాటకు కట్టుబడి కడప జిల్లాలో పార్లమెంటు అధ్యక్షుడిగా సురేష్‌బాబును నియమించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడడం అనేది వైఎస్‌ కుటుంబానికే చెల్లిందని పేర్కొన్నారు.

  నేనూ ఒకప్పుడు సాధారణ కార్యకర్తనే...

  నేనూ ఒకప్పుడు సాధారణ కార్యకర్తనే...

  ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మేయర్‌ సురేష్‌బాబుకు అధ్యక్ష పదవి పాతదే అయినప్పటికీ సమయం మాత్రం కొత్తదని అన్నారు. వైసీపీలో కార్యకర్తలకు అమితమైన గుర్తింపు ఉందన్నారు. 2011లో పార్టీ ఆవిర్భావ సమయంలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఆ తరువాత ఎమ్మెల్యేగా చేశారని తెలిపారు.

   టీడీపీకి చెమటలు పట్టిస్తోన్న జగన్...

  టీడీపీకి చెమటలు పట్టిస్తోన్న జగన్...

  పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌కు దక్కిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్‌ జగన్‌ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నారని అన్నారు.

  ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌, బద్వేలు ఇన్‌ఛార్జ్‌ వెంకటేష్‌, జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌ మిథున్‌రెడ్డి, టీఎస్ఆర్‌ నిత్యానందరెడ్డి, మాసీమబాబు, బూస్ట్‌, చల్లా రాజశేఖర్‌, కరీముల్లా, షఫి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఖాజా రహమ్మతుల్లా, ఆదిత్యరెడ్డి, ఉమామహేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, పత్తి రాజేశ్వరి మహిళలు పాల్గొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YCP MLAs and other leaders told that TDP is in fear of YS Jagan and also 98 percent people of the state against to CM Chandrababu Naidu here in Cuddapah on Friday. Cuddapah Mayor Suresh Babu taken oath as President of the Parliament Constituency on Friday in the Party District Office. YCP District President Akepati Amarnath Reddy, YCP MLAs Raghurami Reddy, Ravindranath Reddy, Amzad Basha, Rachamallu Prasad Reddy and other leaders are participated in this programme.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more