వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్తగా 998 కరోనా కేసులు... 14 మంది మృతి... చిన్నారులకూ వైరస్...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 998 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది.శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 10,17,140 మందికి కరోనా టెస్టులు చేసినట్లు తెలిపారు.

విజయవాడ కోవిడ్ 19 ఆస్పత్రిలో దారుణం... అదృశ్యమైన వృద్దుడు మృతి..విజయవాడ కోవిడ్ 19 ఆస్పత్రిలో దారుణం... అదృశ్యమైన వృద్దుడు మృతి..

కర్నూలులో ఐదుగురు,అనంతలో ముగ్గురు మృతి..

కర్నూలులో ఐదుగురు,అనంతలో ముగ్గురు మృతి..

తాజాగా కరోనా సోకినవారిలో విదేశాల నుంచి వచ్చిన ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మంది ఉన్నారు.ఇప్పటివరకూ 8422 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 10,043 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు...

ఏ జిల్లాలో ఎన్ని కేసులు...

కర్నూలు జిల్లా -2,451,అనంతపురం జిల్లా -2,186.కృష్ణా జిల్లా - 1,743,గుంటూరు జిల్లా - 1,827,తూర్పుగోదావరి జిల్లా - 1,607,చిత్తూరు జిల్లా- 1,324,కడప జిల్లా - 1,245,పశ్చిమగోదావరి జిల్లా - 1,164,నెల్లూరు జిల్లా -730,ప్రకాశం జిల్లా - 700,విశాఖపట్నం జిల్లా - 721,విజయనగరం జిల్లా -215,శ్రీకాకుళం జిల్లా - 189,ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు- 2,179,ఇతర దేశాల నుంచి వచ్చిన వారు- 416,మొత్తం కేసులు - 18,697.

వైరస్ బారిన 1200 మంది చిన్నారులు...

వైరస్ బారిన 1200 మంది చిన్నారులు...

రాష్ట్రంలో ఇప్పటివరకూ 1200 మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వృద్దులు,రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకే వైరస్ సోకే అవకాశాలు ఎక్కువని చెబుతున్నా... చిన్నారులకు కూడా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వైరస్ సోకిన చిన్నారుల్లో స్వల్ప పాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని... చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

Recommended Video

Panic in Hyderabad as Top Jeweller Party With Hundreds of Attendees Got Corona || Oneindia Telugu
ఏజ్ గ్రూప్స్ వారీగా...

ఏజ్ గ్రూప్స్ వారీగా...

ఇప్పటివరకూ ఏపీలో నమోదైన 18,697 కేసుల్లో.. 16 నుంచి 45 ఏళ్లలోపు వారు 10,500 ( 62శాతం) మంది ఉన్నారు. 46 నుంచి 60ఏళ్లలోపు వారు 3450 (20శాతం) ఉన్నారు. కేవలం 10శాతం మంది మాత్రమే 60 ఏళ్లు పైబడ్డ వృద్దులు ఉన్నారు. రాష్ట్రంలో నమోదైన మరణాల్లో ఎక్కువగా 60 ఏళ్లు పైబడ్డ వారే ఉన్నారు. అయితే,మృతుల్లోనూ అప్పటికే డయాబెటిస్,బీపీ,గుండె సంబంధిత తదితర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు.

English summary
On Sunday,998 fresh coronavirus cases were reported in Andhra Pradesh,the total number reached to 18,697. Another 14 deaths reported from the state in last 24 hours,the death toll rised 232.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X