వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమించి గర్భవతిని చేశాక, కులం తక్కువన్నాడు, ఆమె ఏం చేసిందంటే?

ప్రేమించి పెళ్ళిచేసుకొంటానని నమ్మించాడు, ఆమె గర్భం దాల్చిన తర్వాత కులాలు వేరు కావడంతో పెళ్ళికి నిరాకరించాడు పవన్ కుమార్. దీంతో ఆ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

శ్రీకాళహస్తి :ప్రేమించానని చెప్పాడు, పెళ్ళిచేసుకొంటానని నమ్మించాడు,ప్రేమికుడి మాటలు నమ్మి ఆమె గర్భం దాల్చింది. అవసరం తీరాక కులం కాదని చెప్పాడు, దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకొంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. ప్రేమించానని చెప్పాడు, నమ్మించాడు. పెళ్ళిచేసుకొంటానని వాగ్థానం చేశాడు. ఆమెతో అవసరం తీర్చుకొన్నాడు. ఆమె గర్భం దాల్చింది.

a 15 year old girl sucide for lover cheating

శ్రీకాళహస్తికి చెందిన ఓ కాలనీలో దళిత బాలిక స్థానికంగా ఉండే దుకాణంలో పనిచేస్తుండేది. టిఎంవీకండ్రిగకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడా ఆమెతో పరిచయం పెంచుకొన్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఆ ఆమ్మాయిని పెళ్ళి చేసుకొంటానని నమ్మించాడు. ఈ నమ్మకంతో ఆ బాలిక తన సర్వస్వం ఆర్పించింది.ఆమె గర్భం దాల్చింది.అయితే గర్భం దాల్చిన విషయం తెలుసుకొన్న బాలిక తనను పెళ్ళిచేసుకోవాలని పవన్ కు కోరింది.

అయితే కులాలు వేరు కావడంతో పెళ్ళికి పవన్ కుమార్ నిరాకరించాడు. దీంతో ఆ బాలిక పవన్ పై కేసు పెట్టింది. పోలీసులు పవన్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తనకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించిన ఆ బాలిక ఉరివేసుకొని బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొంది.

English summary
15 year old girl sucide for lover cheating in srikalahasti town
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X