• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీ రెడ్డి...నా సందేహాలకు సమాధానం చెప్పు:ఇట్లు ఒక సామాన్యుడు

By Suvarnaraju
|

ప్రజెంట్ అన్ని రకాల తెలుగు మీడియాల్లో శ్రీరెడ్డి టైమ్ బ్రహ్మాండగా నడుస్తున్నసంగతి తెలిసిందే. తెలుగు టివి ఛానెళ్లే లోనే కాదు యూట్యూబ్ లో,ఫేస్ బుక్,వాట్సప్ లాంటి సోషల్ మీడియాల్లోనూ ఆమెదే హవా.

ఇక ఇటీవలే అర్థ నగ్న ప్రదర్శనతో శ్రీరెడ్డి క్రేజ్ ముంబాయికే పాకేసింది ఆర్జీవీ అంటుంటే ఆమె చేసిన పోరాటం ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించిందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా గత నెల రెండు నెలలుగా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్ననటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తికి సంబంధించి తాజాగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీరెడ్డి గురించి తనకు కొన్నిసందేహాలు ఉన్నాయని, వాటిని ఆమె తీర్చేస్తే ఆమెతో పాటు ఉద్యమానికి సిద్దమంటూ ఒక సామాన్యుడు పేరిట చేసిన పోస్ట్ ఇది!

A Common Man Express his doubts on Sri Reddy life style

శ్రీరెడ్డి...

సినిమా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి నడుం బిగించి, ఉద్యమస్ఫూర్తితో దూసుకెళ్తున్న మీకు అభినందనలు. నిజంగా మీ కృషితో తెలుగు అమ్మాయిలు అందరికీ సినిమాల్లో అవకాశాలు రావడంతో పాటు క్యాస్టింగ్ కౌచ్ అంతరించిపోతే సంతోషపడేవాళ్లలో నేనూ ఒకడిని. కాకపోతే, ఇప్పటికీ ఎక్కడో ఏవో చిన్న సందేహాలు ఇంకా మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అవేవో మీరు తీర్చేస్తే, మీతో కలిసి ఉద్యమానికి సిద్ధమైపోతాం.

1. పది పన్నెండేళ్లుగా తెలుగు సినిమా ఫీల్డ్ లో ఉన్న మీరు చేసినవి రెండే రెండు సినిమాలు. అవి కూడా ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు పోయాయో ఎవరికీ తెలీదు. వాటిలో మీ పాత్రేమిటో అసలే తెలీదు. ఈ పదేళ్లు నెలకి కనీసం రెండు లక్షల రూపాయల ఖర్చుతో మీరెలా బ్రతికారు. ఒక కారు, ఒక ఖరీదైన అద్దె అపార్ట్ మెంట్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో చెప్పగలరా..?

2. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మీకు అసలు డబ్బులెలా వచ్చాయి..? ఒక ఆడపిల్ల మీరేసుకుంటున్న స్థాయి బట్టలతో నెల మెయింటెయిన్ చేయాలంటే కనీసం లక్ష రూపాయలు అవసరమవుతాయి. మీకు డబ్బెక్కడినుంచి వస్తోంది..ఎవరిస్తారు..? మీకు నెల మొత్తం ఎలా గడుస్తోంది..?

  ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయం గురించి నా పోరటం

  3. అవకాశాలిప్పిస్తామని మిమ్మల్ని అందరూ వంచించారని చెబుతున్నారు కదా..మీరు ఎవర్నీ కాంటాక్ట్ చేయకుండానే, మీరు ఎవరికీ అవకాశమివ్వకుండానే వాళ్లంతట వాళ్లే మిమ్మల్ని వంచించారా..? (ఇక్కడ మీ ప్రత్యర్ధుల్ని సమర్ధిస్తున్నామని అనుకోకండి). మీ ప్రోద్భలం లేకుండానే ఇన్ని వ్యవహారాలూ జరిగాయా..? మీరు చూపెడుతున్న ఛాటింగ్ స్క్రీన్ షాట్లు అన్నింటిలోనూ వాళ్లూ మాట్లాడారు, మీరు మాట్లాడారు. వాళ్లు మిమ్మల్ని బేబీ అంటే, మీరు హనీ అన్నారు. మీ అవసరాన్ని వాళ్లు, వాళ్ల అవసరానికి మీరు ఒకరినొకరు వాడుకున్నారు. ఎందుకండీ దీనికి విలువలు, స్త్రీలను లోబరుచుకోవడాలు అంటూ పెద్ద పెద్ద మాటల. మీ ప్రమేయం లేకుండా, మీరు గెస్ట్ హౌస్ లకు వెళ్లకుండా మీరు పబ్బులకు, క్లబ్బులకు తిరక్కుండా, మీరు రెచ్చగొట్టకుండా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా లోబరుచుకున్నారా..? (ఇలా అడిగానని క్యాస్టింగ్ కౌచ్ ను ఎంకరేజ్ చేస్తున్నామని అనుకోకండి). పదేళ్ల క్రితం మీరు సినీఫీల్డ్ కు వచ్చారు. ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడాలని పదేళ్ల తర్వాత కానీ మీకు అనిపించలేదా..? మొదటిసారి మిమ్మల్నెవడో వంచించినప్పుడు, మీలో శ్రీశక్తి ఎందుకు మేలుకోలేదు..? ఆరోజు విలువలెందుకు గుర్తు రాలేదు..?

  నిర్మాత డి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో మీరు దిగిన ఫొటోలు చూస్తే, అసలు ఎవడైనా క్యాస్టింగ్ కౌచ్ అని అనుకుంటాడా..? మీరు, అతను తిరగాల్సినంత తిరిగి, ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేసి, ఇప్పుడు మీమధ్య చెడింది కనుక, రచ్చకెక్కడం జనానికి వినోదం పంచడం కాదా..? తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వడం లేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీ డబ్బు, ప్రతిభ ఆధారంగా నడిచే పరిశ్రమ. తెలుగమ్మాయిలు అద్భుతంగా నటిస్తే అవకాశాలివ్వరా..? ఈ గ్లోబలైజేషన్ రోజుల్లో టాలెంట్ ను కేవలం తెలుగమ్మాయిలు, తమిళమ్మాయిలు అన్న కొలమానంతో ఎవరు చూస్తున్నారు..? ఒక్క డైరెక్ట్ క్వశ్చన్.. అనుష్క, తమన్నా, సమంత, నిత్యామీనన్, రకుల్ ప్రీత్, శృతి హాసన్..వీళ్లందరితో పోలిస్తే మీరు అందంగా ఉంటారా..? వీళ్ల కంటే బాగా నటించగలుగుతారా..? అసలు వాళ్లతో మీకు పోలికుందా..? అసలు మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి ఎవ్వడైనా సినిమా తీయగలడా..? నిజం చెప్పండి..

  సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది. ఎప్పటినుంచో ఉంది. అయితే అది పూర్తిగా పరస్పర అవగాహనతో, అవసరాల కోసం చేసేది. అయినంత మాత్రాన, నటన రాని వాళ్లకు, అందం లేని వారికి పడుకుంటే అవకాశాలిచ్చేస్తారా..? తెలుగులో ఈమధ్య కాలంలో వచ్చిన అంజలి, మాధవి లత, అర్చన, జూనియర్ సుహాసిని, శ్రీవిద్య వీళ్లంతా అద్భుతమైన నటీమణులా..? తెలుగులో దర్శకులకు, హీరోలకు ఎవరితో సినిమాలు తీయాలో తెలియదా..? నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి..మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి ఎవ్వడైనా సినిమా తీయగలడా..? కామెడీ కాకపోతే..!

  నిజంగా మీరు సినిమా ఇండస్ట్రీ బాగు కోసమో, క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టడానికో అభిరామ్ దుర్మార్గాన్ని బయటపెట్టడానికో అయితే, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసేవారు. మీరు టీవీ ఛానెల్స్ కు వెళ్లిన రోజే, మీ లక్ష్యమేంటో అందరికీ అర్ధమైంది. కాకపోతే, అందరికీ అన్నీ తెలిసినా, ఎంటర్టైన్ మెంట్ కోసం ఓ పదిరోజులు మీ తమాషా చూశారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చివరికి బలయ్యేది ఎవరో తెలుసా..? మీరే..! ఈ రెండు రాష్ట్రాల్లో గడిచిన ముప్ఫై ఏళ్లలో పేపర్లు కానీ, టీవీ ఛానెల్స్ కానీ ఏ సమస్యనూ పరిష్కరించలేదు. కొన్ని పరిష్కారాలు కాలనుగుణంగా జరిగాయంతే..ముఖ్యంగా న్యూస్ ఛానెల్స్ మీలాంటి వాళ్లు అప్పడప్పుడూ దొరికే జున్ను ముక్కల్లాంటోళ్లు. మీరు టీవీ ఛానెల్స్ ను వాడుకోవాలని మీరనుకుంటే, మిమ్మల్ని సాంతం వాడేయాలని వాళ్లనుకున్నారు. అసలొక టీవీ ఛానెల్ మీ సమస్యకు పరిష్కారం ఎలా చూపెడుతుందో చెప్పండి..ఎంత పిచ్చిదానివి శ్రీ రెడ్డీ నువ్వు..?

  ఇంకా రెండు రోజుల కంటే ఎక్కువ నిన్ను టీవీ ఛానెళ్లు, జనాలు భరించలేరు. జనానికి, టీవీలకు మరో కొత్త ఇష్యూ కావాలి. పబ్లిక్ దృష్టిలో నువ్వెప్పుడో చీప్ అయిపోయావు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా నీకు కాల్ చేయాలంటే భయపడుతున్నారు. కనీసం నీకు అవకాశం ఇవ్వాలనుకునేవాళ్లు కూడా లేనిపోని తలనొప్పులు దేనికిలే అని దూరంగా ఉంటారు. ఏదో లబ్ధి కోసం నువ్వు, మీడియాలో కొందరు కలిసి వేసిన ఎత్తుగడ, చివరికి నిన్ను దారుణంగా బలితీసుకుంటుంది. నిన్ను రోజూ చూపిస్తే రేటింగ్ రాదు. అందుకని టీవీ ఛానెల్స్ నిన్న వదిలేసుకుంటాయి. రోజూ నువ్వు బట్టలిప్పినా చూడాలనే ఆసక్తి కూడా ఎవరికీ ఉండదు. అవకాశాలు తన్నుకుంటూ రావడానికి నువ్వు మహానటివీ కాదు. నీకిదంతా అర్ధమయ్యేటప్పటికి, జరిగాల్సిన డ్యామేజ్ ఎప్పుడో జరిగిపోయింది. టీవీ న్యూస్ ఛానెల్స్, మా అసోసియేషన్ సినిమాల్లో కొందరు పెద్దలు, మీడియా వాళ్లు, అందరూ చివరికి ఒక్కటై నిన్ను ఆల్రెడీ ముంచేశారు. ఒక 3 నెలల తర్వాత అసలేం జరిగిందో నీకు అర్దమవుతుంది. కానీ అప్పటికే, కథ ముగిసిపోతుంది.

  ఇట్లు

  గత కొద్దికాలంగా నీ పనులకు విసిగిపోయి ఉన్నఒక సామాన్యుడు

  చదివారుగా...ఇదండి శ్రీరెడ్డిపై ఆ సామాన్యుడి సందేహాలతో కూడిన పోస్ట్...మరి ఈ పోస్ట్ శ్రీరెడ్డికి చేరిందో లేదో?...చేరినా ఆమె స్టార్లకే తప్ప సామాన్యులకు సమాధానం చెబుతుందో లేదో కాని...ఆ సామాన్యుడైతే తాను అడగాలనుకున్నవి అడిగేశాడు...

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Sri Reddy, who has been shaking Whole Telugu industry since two months, In this background a common man express his doubts on the social media platform.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more