వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో బాక్సైట్ మైనింగ్ పై పూర్తి నిషేధం విధించిన జగన్ .. ఆ జీవో రద్దు

|
Google Oneindia TeluguNews

ఏపీలో జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాక్సైట్ తవ్వకాలపై పూర్తి నిషేధం విధించారు. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమలలో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వకాలు చెయ్యటానికి గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ నిర్ణయాన్ని పర్యావరణ వేత్తలు , ఎన్జీవోలు అభినందించాయి.

శవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యేశవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యే

Recommended Video

ముగిసిన బీఏసీ సమావేశం
 బాక్సైట్ తవ్వకాలను అనుమతించే ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించిన సీఎం జగన్

బాక్సైట్ తవ్వకాలను అనుమతించే ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించిన సీఎం జగన్

ఏపి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎమ్‌డిసి) బాక్సైట్ తవ్వకాలను అనుమతించే ప్రభుత్వ ఉత్తర్వులను (జిఒ) 97 ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నారు.గత టిడిపి ప్రభుత్వం నవంబర్ 5, 2015 న చింతపల్లె మరియు జేరెల్లాలోని 1,212 హెక్టార్ల రిజర్వ్ అటవీ విస్తీర్ణంలో ఎపిఎండిసిని బాక్సైట్ తవ్వకాలను చేయడానికి అనుమతించింది. అయితే ఆ బాక్సైట్ గనుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని గిరిజనులు, ఎన్జీఓలు, సామాజిక, పర్యావరణ కార్యకర్తలు దీనికి వ్యతిరేకంగా అనేక నిరసనలు చేశారు. నిరసనలు పెరిగేకొద్దీ అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం జీవోని అప్పటికి నిలిపివేసింది. ఇక ఆ తర్వాత దాన్ని గురించి పట్టించుకోలేదు.

 గిరిజనుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్న జగన్

గిరిజనుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్న జగన్

అయితే జగన్ సీఎంగా బాధ్యత తీసుకున్న తర్వాత ఈ సమస్య జగన్ దృష్టికి వచ్చ్చింది. దీంతో ఆయన అప్పట్లో బాక్సైట్ తవ్వకాలపై జరిగిన ఆందోళనలు గుర్తు చేసుకుని బాక్సైట్ మైనింగ్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే జీవో 97 ఉపసంహరించుకున్నారు. ఇక మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.వి శాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లో జరిపే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయానికి తేల్చి చెప్పింది.ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు జరపరాదని గిరిజనులు డిమాండ్‌ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ఏపీఎండీసీ రద్దు చేసుకుంది.

అక్కడక్కడ సాగుతున్న అక్రమ బాక్సైట్ తవ్వకాలు .. పోలీసులకు చర్యలకై ఆదేశాలు

అక్కడక్కడ సాగుతున్న అక్రమ బాక్సైట్ తవ్వకాలు .. పోలీసులకు చర్యలకై ఆదేశాలు

అయితే, కొన్ని ప్రదేశాలలో బాక్సైట్ తవ్వకాలు రహస్యంగా జరుగుతున్నాయి. రహస్య మైనింగ్ ను అడ్డుకోవటానికి, అక్రమార్కులపై ఉక్కు పాదం మోపటానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ పోలీసులను ఆదేశించారు. నిరంతరం గిరిజన ప్రదేశాలను సందర్శించి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని జగన్ భావిస్తున్న నేపధ్యంలోనే గిరిజనుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు .

English summary
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy has withdrawn the government order (G.O.) 97 that allows AP Mineral Development Corporation (APMDC) to mine bauxite ore in the Eastern Ghats in Visakhapatnam district.The previous TDP government on November 5, 2015 allowed APMDC to mine in 1,212 hectares of reserve forest area in Chintapalle and Jerella. Tribals, NGOs and social and environmental activists have made numerous protests against this. As the protests grew, then government put the G.O. on hold and did not touch it later on.This issue even got the notice of the new CM Jagan and after giving a thought, he decided to completely ban bauxite mining. The activists who are protesting against mining, welcomed the government's decision.However, bauxite is being secretly mined at few places and CM Jagan has ordered the police to take appropriate measures to end the secret mining as well. Jagan instructed the police to visit tribal places constantly and win the trust of people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X