రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ఐ సహకారం: కరోనా స్పెషల్ డీఎస్పీనంటూ అక్రమాలకు తెగబడ్డ వ్యక్తి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తుండటంలో పోలీసులంతా నిమగ్నమై ఉంటే.. ఓ వ్యక్తి డీఎస్పీ అవతారమెత్తి ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు దండుకున్నాడు. ఈ నకిలీ డీఎస్పీకి ఓ ఎస్ఐ సహకరించడం గమనార్హం. వీరి నాటకం బయటపడటంతో కటకటాలపాలయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

ఎస్ఐ అండదండలతో ఫేక్ డీఎస్పీ అక్రమాలు..

ఎస్ఐ అండదండలతో ఫేక్ డీఎస్పీ అక్రమాలు..

వివరాల్లోకి వెళితే..కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బత్తిన వెంకన్నబాబు అలియాస్ వెంకటేష్/వెంకట్(40) కరోనా ఇంటెలీజెన్స్ ప్రత్యేక డీఎస్పీ అంటూ సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల వద్ద అక్రమంగా డబ్బులు తీసుకునేవాడు. సీతానగరం పీఎస్‌లో గతంలో ఎస్ఐగా పనిచేసిన ఆనంద్ కుమార్ అండదండలతో వెంకట్ మరింతగా అక్రమాలకు తెగబడ్డాడు. డీఎస్పీ అధికారినంటూ అందరినీ నమ్మించడంతోపాటు వివిధ షాపుల్లో విలువైన సామాగ్రిని డబ్బులు చెల్లించకుండానే తీసుకునేవాడు.

ఫేక్ డీఎస్పీపై ఫిర్యాదుల వెల్లువ...

ఫేక్ డీఎస్పీపై ఫిర్యాదుల వెల్లువ...

ఈ క్రమంలో బాధితులు నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీ బాజ్‌పేయ్ ఆదేశాలతో పోలీసులు

నిందితుడిని పట్టుకున్నారు. బుధవారం అతడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన
డీఎస్పీ పీఎస్ఎన్ రావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Recommended Video

Pawan Kalyan Slams AP Govt Over Sand Mafia In West Godavari
చివరకు కటకటాలపాలు..

చివరకు కటకటాలపాలు..

కాగా, రాజమహేంద్రవరంలోనే ఉంటున్న నిందితుడు వెంకన్న బాబు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు అద్దె కార్లు నడుపుతుంటాడు. అయితే, మరింత డబ్బును సంపాదించాలనే దురాశతో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీతానగరం ఇంఛార్జీ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఆనంద్ కుమార్‌ను ఉన్నతాధికారులు ఇప్పటికే వీఆర్‌కు పంపించినట్లు తెలిసింది.

English summary
A fake corona special dsp arrested in east godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X