వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని కొట్టి చంపిన తనయుడు...! వీడియో తీసిన కూతురు..!

|
Google Oneindia TeluguNews

వృద్యాప్యంలో ఉన్నవారికి ఆసరా కల్పించడంతో పాటు, ఎటువంటి ఆదాయంలేని బలహీన వర్గాలకు సహయం అందించడం కోసం ప్రభుత్వం ఇస్తున్న పెన్షలు వృద్యాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వచ్చిన పెన్షన్ కోసం కుటుంభ సభ్యులు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. బలహిన పరిస్థితుల్లో ఉన్న వృద్దులపై కుటుంభ సభ్యులు దాడులు చేస్తున్న సంఘటనలు కూడ చేసుకుంటున్నాయి..ఈ నేపథ్యంలోనే ఓ కొడుకు వ్యవహారం శృతిమించింది. మద్యం మత్తులో వచ్చి, పింఛన్ డబ్బుల కోసం తండ్రిని కొట్టిన వ్యవహారం క్రిష్ణ జిల్లాలో చోటుచేసుకుంది.

క్రిష్ణాజిల్లా చందర్పపాడులో నివసిస్తున్న మహబుబ్ సాహెబ్ కుటుంభం నివసిస్తోంది. అయితే ఈ నెల ఎనిమిదిన మహాబాబ్ సాహెబ్ ఫించన్ డబ్బులు తీసుకున్నాడు. దీంతో అదే రాత్రి కోడుకు షిలార్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు. అయితే ఇందుకు నిరాకరించిన మహబుబ్‌ సాహెబ్‌ను షిలార్ ఇష్టానుసారం కొట్టాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా వ్యవహరించాడు. తండ్రిని కొట్టుకుంటూ బయటకు తీసుకువెళ్లి బాత్రుంలో బంధించాడు. అంతకు ముందు గోడకు బలంగా తలను బాదాడు.

A father was beaten and taken out and locked in the bathroom by his son for pension money

దీంతో సృహతప్పి కిందపడిపోయిన మహబుబ్‌సాహెబ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పోందుతూ మహబుబ్ సాహెబ్ మృతి చెందాడు. అయితే సంఘటన జరిగిన సమయంలో తండ్రికోడుకులు ఇద్దరు కూడ మద్యం మత్తులో ఉన్నట్టు మహబుబ్ సాహెబ్ పెద్ద కుమారుడు చందార్ తెలిపాడు.కుటుంభ సభ్యుల పిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A father was beaten and taken out and locked in the bathroom by his son . He knocked father head against the wall for pension money.The Mahabub Saheb family lives Chanderpaupadu in Krishna district.when asked the money fateher defeated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X