• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనవడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు ఉచిత సలహా ఇచ్చిన లక్ష్మీ పార్వతి

|

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మి పార్వతి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుండి కోలుకోవటానికి ఉచిత సలహా ఇచ్చారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ మనవడు లోకేష్ ను టార్గెట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనవడు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి .. లోకేష్ ను పక్కన పెడితే టీడీపీ బాగుపడుతుందని సలహా

మనవడు లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి .. లోకేష్ ను పక్కన పెడితే టీడీపీ బాగుపడుతుందని సలహా

తాజా రాజకీయాల నేపధ్యంలో జగన్ పాలనకు కితాబిచ్చిన లక్ష్మీ పార్వతి , ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, మాజీ మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. లోకేష్ ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా పార్టీ భ్రష్టు పడుతుందని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు . మహిళల్ని కించపరిచేలా లోకేష్ మాట్లాడుతున్నారని మనవడిపై విరుచుకు పడ్డారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల టిడిపి గ్రాఫ్ బాగా తగ్గుతుందని పేర్కొన్నారు . మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసే అలవాటు ఉన్నందున లోకేష్ తక్కువ మాట్లాడాలి అని లక్ష్మి పార్వతి సూచించారు . మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు . ఎంత త్వరగా లోకేష్ ను పక్కన పెడితే చంద్రబాబుకు , టీడీపీకి అంత మంచిది అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.

ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్టు ప్రతిపక్షం తీరు ఉందన్న లక్ష్మీ పార్వతి

ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్టు ప్రతిపక్షం తీరు ఉందన్న లక్ష్మీ పార్వతి

అంతేకాదు ఏపీ ప్రజా పరిపాలన సాగుతోందని.. జగన్ మంచి, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని , ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు లక్ష్మీ పార్వతి . ఓవైపు ఇల్లు బాగు చేస్తుంటే ఎలుకలు ఏడ్చినట్లుగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ఏపి సిఎం వైయస్ జగన్ పాలనకు కితాబిస్తూ గత ప్రభుత్వ పరిపాలన లోని అవినీతి ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, టిడిపి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, ఎదురు దాడికి దిగుతున్నారని ఆమె పేర్కొన్నారు.

  రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోము - లోకేష్
  లోకేష్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్న లక్ష్మీ పార్వతి .. బాబుకు ఉచిత సలహా

  లోకేష్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్న లక్ష్మీ పార్వతి .. బాబుకు ఉచిత సలహా

  మొత్తానికి చంద్రబాబుకు లోకేష్ బాబు విషయంలో ఉచిత సలహా ఇచ్చి లక్ష్మీ పార్వతి షాక్ ఇచ్చారు . టీడీపీ రాబోయే రోజుల్లో బాగుపడలాంటే చంద్రబాబు ఆ పని చేస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చిన వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ఇప్పటికే చాలా సార్లు మనవడిని టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో కూడా లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన ఆమె మనవడా .. మందలగిరి కాదు మంగళగిరి అని స్పష్టంగా పలుకు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోమారు చంద్రబాబు రాజకీయ వారసుడిగా భావిస్తున్న లోకేష్ బాబుని పక్కన పెట్టాలని చెప్పి సంచలన వ్యాఖ్య చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress leader Lakshmi Parvathi gave a free advice to TDP chief Chandrababu Naidu to bounce back and it is to distance his son Nara Lokesh. Lakshmi Parvathi on Friday paid a visit to Tirumala and speaking to the media outside the temple, she made the above statement."The quick TDP keeps Nara Lokesh aside, the better for the party. The more he speaks, the graph of TDP goes down drastically. Lokesh should speak less as he has habit of making insulting comments on women," said Lakshmi Parvathi and also warned that if he doesn't stop further, the consequences would be severe in the coming days.Praising AP CM YS Jagan, she added that it's people's governance going-on in the state and while trying to clean the entire administration of previous government, TDP leaders are deliberately crying foul on it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more