వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: సీఎం జగన్ నివాసం సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు, మహిళకు తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాడేపల్లిలో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసానికి సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

ఆదివారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి తలుపులు, ఇనుప గేట్లు విరిగిపడ్డాయి. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు.

 A fridge blasted in Tadepalli near to CM house

కాగా, పేలుడు సమయంలో ఆ ఇంట్లో ఉన్న పైడమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

భారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్‌పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులుభారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్‌పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి పేలుడు జరిగిన స్థలం కూతవేటు దూరంలోనే ఉండటంతో పోలీసులు చుట్టుపక్కల కూడా పరిశీలించారు. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది.

ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. భారీ స్థాయిలో పేలుడు ప్రభావం ఉండటంతో మరేదైనా పేలివుంటుందా? అనే కోణంలో విచారిస్తున్నారు. గాయపడిన మహిళను కూడా ప్రశ్నించనున్నారు పోలీసులు. సీఎం సమీపంలో పేలుడు సంభవించడం, భారీగా శబ్ధం రావడం స్థానికంగా కలకలం రేపింది.

హైకోర్టు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో పెట్టాలంటూ డిమాండ్లు పెరుగుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రరాష్ట్ర అవతరణ సమయంలో కర్నూలులోనే రాజధాని, హైకోర్టు ఉండేవని.. అనంతర కాలంలో హైదరాబాద్‌కు తరలిపోయాయని వారంటున్నారు.

ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర న్యాయవాదులు కూడా తమకు రాజధానితోపాటు హైకోర్టు కూడా దూరమేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజధాని ప్రాంత నాయవాదులైతే.. అమరావతిలోనే హైకోర్టు ఉంటే అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందని, ఇక్కడ్నుంచి తరలించవద్దని ఇక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టును తరలించాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

English summary
A fridge blasted in Tadepalli near to CM YS Jaganmohan Reddy's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X