బహిర్భూమికెళ్లిన బాలికపై గ్యాంగ్‌రేప్: రూ.2లక్షలతో వెల కట్టారు

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: నగరంలో శనివారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం యువకుల కుటుంబసభ్యులు గ్రామ పెద్దలతో రాజీకి యత్నించారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చిత్తూరు నగరంలోని ఓ దళితవాడకు చెందిన బాలిక(12) శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బహిర్భూమికోసం సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. అయితే అత్యాచారం చేసిన యువకుల కుటుంబసభ్యులు ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబసభ్యులతో గ్రామ పెద్దల ద్వారా రాజీయత్నాలు చేస్తున్నారని సమాచారం.

A girl allegedly gangraped in Chittoor

ఇందుకు గానూ బాలిక కుటుంబానికి ఇద్దరు నిందితులు చెరో రూ. లక్ష పరిహారం చెల్లిస్తామని చెప్పినట్టు తెలిసింది. కాగా, అప్పటికే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై టూటౌన్ సీఐ వెంకటప్ప మాట్లాడుతూ.. బాధిత బాలికను ఈవ్ టీజింగ్ చేసినట్లు తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడేమో అత్యాచారం అని చెబుతున్నారని అన్నారు. ఘటనకు సంబంధం ఉన్న అందర్నీ విచారిస్తున్నామని, తప్పు జరిగినట్లు తేలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

యంత్రంలో జడ జిక్కుకుని యువతి మృతి

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
వేరుశనగ ఒబ్బిళ్ల యంత్రంలో ప్రమాదవశాత్తు జడ చిక్కుకుని ఓ యువతి మృతి చెందిన ఘటన మండలంలోని మద్దిలేడులో ఆదివారం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరయ్య పొలం వద్ద వేరుశనగ పంటను యత్రం సాయంతో ఒబ్బిళ్లు చేస్తున్నాడు. శంకరయ్య కుమార్తె సుజాత (22) వేరుశనగ చెట్లను యంత్రానికి అందిస్తున్నారు.

ఈ క్రమంలో పొరబాటున ఆమె జడ యంత్రంలో చిక్కుకుంది. తలభాగం యంత్రంలో ఇరుక్కుపోయింది. తీవ్రంగా గాయపడ్డ సుజాత అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో శ్రీకాళహస్తి ఎమ్మార్సీలో ఎంఐఎస్‌ సమన్వయకర్తగా పనిచేసిన ఆమె.. రాజీనామా చేసి ప్రస్తుతం ఎమ్మెస్సీ చదువుతోంది. సుజాత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl allegedly gangraped by two youths in Chittoor.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి