80కిలోల పురాతన దక్షిణామూర్తి విగ్రహం చోరీ
నెల్లూరు: నగరం పరిధిలోని వెంకటగిరిలో ఉన్న పురాతన శ్రీ కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయం తాళాలు పగులగొట్టి 80 కిలోల బరువు ఉన్న దక్షిణామూర్తి పంచలోహ విగ్రహాన్ని అపహరించుకు వెళ్లారు.
రాజుల ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాలను విదేశాలకు విక్రయించేవారు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాగా, చోరీ అయిన విగ్రహం 300ఏళ్ల నాటిదిగా స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దొంగలు విగ్రహాన్ని చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. 11ఏళ్ల క్రితం దేవాలయంలోని నంది విగ్రహాన్ని కూడా దొంగలు అపహరించారని చెప్పారు.
ఇక్కడి రాజుల సంస్థానంలో కూడా దొంగలు పలుమార్లు దొంగతనాలకు పాల్పడి విలువైన వస్తువులను అపరించుకుపోయినట్లు చెబుతున్నారు. స్థానిక దొంగలు ఇతర రాష్ట్రాల దొంగలకు సహకారం అందిస్తున్నారేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications