గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించాడు.. పెళ్లి టైంకి పారిపోయాడు: పోలీస్‌స్టేషన్‌కు పెళ్లి కూతురు

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

విజయనగరం: గరుగుబిల్లి మండలం దళాయివలస గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన శంకరరావు.. ఉమాకార్తీక అనే యువతి గత 9ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారు. ప్రేమించిన శంకరరావు మాత్రం తన కోరిక తీర్చుకొని ఇప్పుడు పెళ్ళికి మొహం చాటేసాడు. అక్టోబర్ 5వ తేదీన పెళ్లి అని పెళ్ళికూతురు ఇంట అన్ని సిద్ధం చేసుకున్నారు తల్లిదండ్రులు.

పెళ్ళికొడుకు వస్తాడని తమ కుమార్తె వివాహం జరుగుతుందని ఎదురుచూసిన అమ్మాయి తల్లిదండ్రులకు కంటతడి మాత్రమే మిగిలింది. ముహూర్తం సమయానికి పెళ్లి పీటలపై కూర్చొని ఎదురు చూసిన పెళ్లి కూతురు.. శంకరరావు రాకపోవడంతో కాళ్ళ పారణితోనే పోలీస్ స్టేషన్‌కి పరుగులు తీసింది. ప్రేమించిన యువకుడు పెళ్లాడతానని నమ్మబలికి చివరికి పెళ్లిరోజు ఊరి నుండి పరారయ్యాడు. నెలరోజుల క్రితమే పోలీసులు రెండు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం గమనార్హం.

A groom escaped marriage with his girlfriend

6నెలలు గడువుకోరి, సమయం అయిపోయిన తరువాత ఉమాకార్తీకకు ఫోన్ చేసి.. 'నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఏ పోలీసులు నన్ను ఏమి చేయలేరు' అని బెదిరింపులకు పాల్పడ్డాడు శంకరరావు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కలిసి కూర్చొని అక్టోబర్ 5వ తేదీన వివాహం నిర్ణయించారు. కానీ, పెళ్ళికొడుకు శంకరరావు కనిపించకుండా పోయాడు.

శంకరరావు మేనమామ కొల్లి సురేష్ , పోలీసు కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం లేదని ఉమాకార్తీక ఆరోపిస్తోంది. దీంతో గురువారం ఏఎస్పీ బర్ధర్‌ను కలిసి మొర పెట్టుకుంది పెళ్లికూతురు. న్యాయం చేస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చినప్పటికీ.. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

తప్పిన పెనుప్రమాదం: 36 మంది ప్రాణాలు సేఫ్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుండి విజయవాడ వైపు ప్రయాణికులతో వెళుతున్న సాయికృష్ణ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయరహదారిపై ప్రమాదానికి గురైంది. ఎదురుగా వెళుతున్న లారీని డీ కొట్టిన బస్ అదుపు తప్పి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జీ డివైడర్ ని ఢీకొంది. చీకటిలో బ్రిడ్జీ కనిపించకపోవడం వలెనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.

ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని మరొక వాహనంలో తరలించారు. తాడేపల్లి ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించి బస్సు కొద్దిగా ముందుకు వెళ్ళివుంటే అందరు నీటిలో పడి ఉండేవారని , తృటిలో పెనుప్రమాదం తప్పినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బస్‌లో మొత్తం 36 మంది ప్రయాణీకులు ఉన్నారు.

English summary
A groom escaped marriage with his girlfriend in Vizianagaram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X