గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమె చెప్పిన గాథ: గుంటూరు అత్తకు మోడీ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. ప్రధాని మోడీ దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నందుకు ఆమెను అభినందించారు. చురుగ్గా పాల్గొనడం అంటే ఏదో చేసేయడం కాదు.. తన ఇంటికి వచ్చిన కొత్త కోడలికి మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించిందా మహిళ.

అసలు విషయానికస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్' వెబ్‌సైట్‌లో గుంటూరు అత్తగారి గురించిన అభినందనపూర్వకంగా కథనం ఒకటి వెలువడింది. ఈమెతోపాటు మరికొంతమంది స్ఫూర్తిదాయక కథనాలను ప్రచురితం చేసింది. కాగా, వీరందర్నీ మోడీ ప్రత్యేక అభినందించారు.

A Guntur aunty praised by PM Modi

మోడీ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ అత్తగారి పేరు సంషున్. ఆమెది గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం. గత సంవత్సరం ఆమె కుమారుడికి వివాహం సందర్భంగా షంషున్.. కోడలు సల్మాకు మరుగుదొడ్డిని బహుమానంగా ఇచ్చింది. దీంతో ఆ కోడలు తన అత్త ఇచ్చిన బహుమతి పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఆ అత్త తనకు ఎదురైన ఇబ్బందులను వివరించింది.
తాను పేదరికంలో పుట్టి పెరిగినందున బహిర్భూమికి వెళ్లడం తప్ప టాయిలెట్ రూం ఎరుగనని తెలిపింది. బయటికి వెళ్లాల్సిన సందర్భంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది ఉండేదని చెప్పింది.

బహిర్భూమికి వెళ్లిన ప్రతిసారి అవమానభారంతో కుంగిపోయేదాన్నని వాపోయింది. కానీ, కాలం అలా గడిపోయిందని, తన పిల్లలు కూడా అలానే పెరిగారని చెప్పింది. అయితే, ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా బంధువులు కూడా తమ ఇంటికి వచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే, గత సంవత్సరం తన కొడుకు పెళ్లి ఖాయం చేసినట్లు తెలిపింది. వచ్చే అమ్మాయి చెంబు పట్టుకుని బయటికి వెళ్లడాన్ని ఊహించుకోలేకపోయినట్లు వెల్లడించింది. అందుకే మరుగుదొడ్డి కట్టించాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి తన సొంత డబ్బు రూ.4వేలు జమ చేసి మరుగుదొడ్డిని ఇంటి ఆవరణలోనే నిర్మించుకున్నట్లు తెలిపింది.

తన ఇంటికి వచ్చిన కొత్త కోడలికే మరుగుదొడ్డిన బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. అంతేగాక, తన కోడలు ఇప్పుడు గర్భవతి అని, ఇప్పుడంతా సంతోషమేనని చెప్పుకొచ్చింది ఆ అత్తగారు షంషున్.

English summary
A Guntur aunty praised by Prime Minister Narendra Modi for Swachh Bharat campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X