• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీకా వేసిన కొద్దిసేపటికే ఏడాదిన్నర చిన్నారి మృతి: తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

|

గుంటూరు: జిల్లాలోని మాచర్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీకా వేసిన కొద్దిసేపటికే ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెదిన జూపల్లి నాగరాజు, అనూష కుమార్తె దేవశ్రీ(ఏడాదిన్నర)కి బుధవారం మండాది సచివాలయంలో ఆరోగ్య కార్యకర్త డీపీటీ, మీజిల్స్, రుబెల్లా, టీకాను వేశారు. ఒకవేళ జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రం సగం వేయమని ఆరోగ్య కార్యకర్త తెలిపారు.

 A kid died after taking dpt vaccine in Guntur district

టీకా వేసిన కొద్దిసేపటికి తల్లి అనుష చిన్నారి దేవవ్రీకి పారాసిటమాల్ మాత్ర వేసింది. అయితే, కొద్దిసేపటికే తల్లి ఒడిలోనే చిన్నారి వాలిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లి, బంధువులు హుటాహూటిన మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో దేవశ్రీ మృతదేహంతో ధర్నా నిర్వహించారు. తమ చిన్నారి మృతికి ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆస్పత్రి ఉన్నతాధికారులు, బాధితురాలి బంధువులతో చర్చలు జరిపారు.

నిజాన్ని తేల్చడం కోసం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్పారు.

కాగా, టీకా వేసినప్పుడు పాప బాగానే ఉందని, సగం మాత్రమే వేయమని తమ ఆరోగ్య కార్యకర్త బాధితురాలి తల్లికి చెప్పిందని ఉప్పాలపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. అయితే, ఈ మాత్ర ఏమైనా గొంతులో తట్టుకుని ప్రాణం పోయి ఉంటుందా? అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు పోలీసులు.

  AP CM Jagan To Take Covid Vaccine క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోనున్న సీఎం జ‌గ‌న్

  రోడ్డు ప్రమాదం: వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో దంపతులు మృతి
  విశాఖపట్నంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకాని నగర్ హైవేపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గాజువాక జగ్గు జంక్షన్‌కు చెందిన నాగేశ్వరరావు, రమాదేవిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా వేటపాలేనికి చెందిన నాగేశ్వరరావు, విశాఖలోని ఓ ప్రైవేట్ కాలేజీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి గాజువాకలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, గురువారం నాడు మర్రిపాలెంలో ఉంటున్న తన బాబాయ్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా.. కాకానినగర్ హైవేపై వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య రమాదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు మృతి చెందాడు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగేశ్వరరావు దంపతుల మృతి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  English summary
  A kid died after taking dpt vaccine in Guntur district.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X