ప్రేమించాడు పెళ్ళిచేసుకొన్నారు ముగ్గురు పిల్లలు పుట్టాక ప్రియురాలిని వదిలి...ప్రియుడిలా...
ప్రేమ పేరుతో వంచించిన ప్రేమికుడు గాథ ఇది. ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఏడాది తిరక్కముందే ప్రియుడి నిజ స్వరూపం బట్టయలైంది .అయితే తల్లిదండ్రులు కూడ బాధితురాలికి ఆశ్రయం కల్పించేందుకు ముందుకు.
ర్నూల్: ప్రేమ పేరుతో వంచించిన ప్రేమికుడు గాథ ఇది. ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఏడాది తిరక్కముందే ప్రియుడి నిజ స్వరూపం బట్టయలైంది .అయితే తల్లిదండ్రులు కూడ బాధితురాలికి ఆశ్రయం కల్పించేందుకు ముందుకు రాకపోవడంతో ఆ బాధితురాలు రోడ్డు పక్కనే ఆశ్రయం పొందుతోంది.
కర్నూల్ జిల్లా పత్తికొండకు చెందిన లక్ష్మి నర్సింగ్ కోర్సును చేసేది.అయితే నర్సింగ్ కోర్సు కోసం కర్నూల్ నగరంలోని ధర్మపేటలోని వసతి గృహంలో ఉంటూ చదువుకొనేది. తాను చదువుకొని కుటుంబానికి ఆసరాగా నిలవాలని భావించింది.

అయితే అదే సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన మధుతో ఆమెకు పరిచయమైంది. వసతిగృహ సమీపంలోనే అద్దె గదిలో ఉంటూ క్లీనర్ గా పనిచేసేవాడు. ఇద్దరూ తరచుగా కలిసేవారు. ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది.
వీరిద్దరూ పెళ్ళిచేసుకోవాలని భావించారు.అంతే పెద్దలకు చెప్పకుండానే స్థానికంగా ఉన్న స్నేహితుల సహయంతో 2012 లో వివాహం చేసుకొన్నారు.కుటుంబసభ్యులకు చెప్పకుండానే పెళ్ళి చేసుకొన్నారు.దీంతో లక్ష్మి నర్సింగ్ కోర్స్ మద్యలోనే ఆగిపోయింది. కల్లూరులో ఈ దంపతులు కాపురం పెట్టారు.ఆరు మాసాలు తిరగకముందే ఆడబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి.ఏడాది గడిచేలోపుగా మధు నిజస్వరూపం బట్టబయలైంది.
మొదట అమృతకు జన్మనిచ్చింది లక్ష్మి.ఆనాటి నుండి మధు వేధింపులు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవలు పడడం, కొట్టేవాడు. ఒక్కొసారి వారాల తరబడి ఇంటికి రాకుండా బయట తిరిగేవాడు మధు. కుటుంబం గడవడానికి స్థానికంగా లభించే పనులు చేసుకొని లక్ష్మి జీనవం సాగించేది.
అదే సమయంలో ఆమె రెండో బిడ్డ వైష్ణవికి జన్మనిచ్చింది. మూడో బిడ్డ సాయిధరమ్ తేజ పుట్టిన కొన్ని నెలలకే ఇంటి నుండి బయటకు పంపించాడు. అతను కన్పించకుండాపోయాడు. కన్న తల్లిదండ్రులు ఆశ్రయం కల్పిస్తారన్న నమ్మకంతో వారి వద్దకు వెళ్ళాడు.
తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.అయితే తల్లిదండ్రులు కూడ ఆమెను ఆదరించేందుకు గాను అంగీకరించలేదు.లక్ష్మి తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది.కర్నూల్ లోని బళ్లారి చౌరస్తాలోని జాతీయ రహదారి వంతెన మీద తలదాచుకొంటున్నారు. తన లాంటి పరిస్థితి మరోకరికి రాకూడదని బాధితురాలు చెబుతోంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications