భర్త మరణించాడనే వేదనతో భార్య ఆత్మహత్య, కడపలో విషాదం
కడప:సౌదీ అరేబియా, యెమెన్ దేశాల ఉగ్రవాదుల బాంబు దాదిలో కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేకు భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దుబాయ్ లో మరణించిన భర్త మృతదేహం రాకముందే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.
కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఈ నెల 7వ, తేదిన సౌదీలో మరణించాడు. సోమశిల ముంపు పరిహరం కింద వచ్చిన డబ్బులతో 1980లో ఇంటిని నిర్మించాడు. అయితే ఈ పరిహరం డబ్బులు సరిపోలేదు. పది నెలల క్రితం రూ.3 లక్షలు అప్పు చేసి కువైట్ కు వెళ్ళాడు.

అక్కడ పరిస్థితులు సహకరించలేదు. దీంతో ఆయన అక్కడి నుండి తిరిగి వచ్చాడు. మరో లక్షన్నర అప్పు చేసీ సౌదీకి వెళ్ళాడు. కార్ల సర్వీసింగ్ సెంటర్ లో ఆయన పనికి కుదిరాడు.అంత కుదురుకొంటుందనే సమయంలోనే ఈ నెల 7వ, తేదిన బాంబు పేలి ఆయన చనిపోయాడు.
సౌదీలో బాంబు దాడిలో వెంకటసుబ్బారెడ్డి మరణించిన భార్యకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసినప్పటీ నుండి భార్య ఈశ్వరమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. బుదవారం నాడు ఆమె కమలకూరులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరు ఎల్ కే జీ చదువుతుండగా, మరో అబ్బాయి మూడో తరగతి చదువుతున్నాడు.