గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మగాళ్లూ...జాగ్రత్త:అమ్మాయిల ఫొటోలు ఎరేసి...ఆన్‌లైన్‌లో లక్షలు దోచేశారు;అత్తాఅల్లుడు అరెస్ట్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో డబ్బు సంపాదన కోసం ఈమె తాపత్రయం చూసి సహజీవనం చేస్తున్న వ్యక్తి ఈమెకో ఐడియా ఇచ్చాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగానే ఆ ఐడియా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి కాదు రెండుసార్లు మార్చింది.

Recommended Video

Beware of Adultery in Locanto Site లొకంటో.కామ్‌ తో తస్మాత్ జాగ్రత్త!

తొలిసారి డబ్బుల కట్టలు లెక్కపెట్టుకునేలా చేస్తే...రెండోసారి కటకటాలు లెక్కించేటట్లు చేసింది. ఇదిలావుంటే ఈ ఐడియా అమలు చేయడంలో బిటెక్ చదివిన అల్లుడు ఈమెకు సహకరించడం మరో విశేషం. వీరిద్దరూ కలసి నెట్ నుంచి అందమైన అమ్మాయిల ఫోటోలు డౌన్లోడ్ చేసి అబ్బాయిలకు ఎరగా వేసి డబ్బు సంపాదించేవారు. ఆ తర్వాత దొరికిపోవడం కూడా వెరైటీ గానే జరిగింది. అదెలాగంటే?...

సహజీవనం...ఆ వ్యక్తి ఐడియా

సహజీవనం...ఆ వ్యక్తి ఐడియా

గుంటూరుకు చెందిన జాడా రాజేశ్వరి అనే మహిళ ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే డబ్బు కోసం రాజేశ్వరి తాపత్రయపడుతుండటంతో ఆమెతో సహజీవనం చేస్తున్న ఆ వ్యక్తి ఆన్‌లైన్‌ను అడ్డు పెట్టుకొని మగాళ్ల నుంచి డబ్బులు ఎలా లాక్కోవచ్చో సలహా ఇచ్చాడు. అందమైన అమ్మాయిల ఫొటోలను ఎరగా వేసి అబ్బాయిల నుంచి డబ్బులు బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేయించుకోవచ్చని...ఇందుకు లొకంటో యాప్‌ ఉపయోగపడుతుందని చెప్పాడు.

అల్లుడుతో కలసి...డబ్బులు గిల్లుడు

అల్లుడుతో కలసి...డబ్బులు గిల్లుడు

ఈ క్రమంలో తనకు టెక్నాలజీ తెలిసిన వ్యక్తి సాయం ఉంటే బావుంటుందని ఆలోచించిన ఆమె సత్తెనపల్లిలో ఉండే బిటెక్ చదివిన తన పెద్దల్లుడు తిలక్ కు ఈ విషయం చెప్పింది. అతడూ రెడీ అన్నాడు. ఇక ఇద్దరూ కలిసి లొకంటో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇందులో నెట్ నుంచి డౌన్ లోడ్ చేసిన అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి చాటింగ్ కోసం తమ పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చేవాళ్లు. మగాళ్లు పోన్ చేయగానే వారికి ఫేస్‌బుక్‌ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన అమ్మాయిల ఫొటోలను వాట్సప్‌ల్లో పంపేవారు.

ఆ తర్వాత...ఖాతాలోకి డబ్బులు

ఆ తర్వాత...ఖాతాలోకి డబ్బులు

ఆ అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఆసక్తి చూపగానే ఆంధ్రా బ్యాంక్‌లోని తమ ఖాతా నంబర్‌ ఇచ్చి అందులో డబ్బులు జమ చేయించుకునేవారు. తర్వాత సెల్‌ నంబర్లు మార్చేసేవారు. ఇలా వాళ్లు సుమారుగా 10 లక్షల వరకు వసూలు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ప్రతి పాపం ఎప్పుడో ఒకసారి పండుతుందన్నట్లుగానే వీరిని ఒక అమ్మాయి ఫోటో రూపంలో దురదృష్టం వెంటాడింది.

స్నేహితురాలి ఫోటో...పంపారు

స్నేహితురాలి ఫోటో...పంపారు

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ యువకుడు అమ్మాయిల కోసం చాటింగ్‌ చేశాడు. ఆ సమయంలో తన వద్ద ఒక అందమైన అమ్మాయి ఉందని చెప్పి కృష్ణలంకకు చెంది న ఓ యువతి ఫొటోను అతడికి తిలక్‌ పంపాడు. అయితే ఆ ఫొటోలో ఉన్న యువతిని చూసి అవతలివ్యక్తి షాక్ తిన్నాడు. కారణం ఆ అమ్మాయి అతడి స్నేహితురాలు కావడమే. దీంతో ఆ యువకుడు వెంటనే ఈ విషయాన్ని ఆ యువతికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీనిపై ఆమె కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తిలక్‌తోపాటు అతడి అత్త రాజేశ్వరిని అరెస్టు చేశారు. ఏప్రిల్‌ నెల నుంచి వారిద్దరూ ఈ మోసాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అమ్మాయిల ఫొటోలను ఎరగా వేసి రూ.5 లక్షలను లాగేశారని పోలీసులు చెబుతున్నారు. వారికి కోర్టు 20 రోజుల రిమాండ్‌ విధించింది.

English summary
Guntur:Police arrested a lady and her son-in-law from Guntur, who was looting lakhs of rupees from men through Online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X