కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"నన్నేపెళ్లాడు"..లేడి ప్రొఫెసర్ కు సహచరుల వేధింపులు...రాయలసీమ వర్శిటీలో కలకలం....

|
Google Oneindia TeluguNews

వాళ్లంతా ఉన్నత విద్యావంతులు...స్టూడెంట్స్ కు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్నవాళ్లు. కానీ వాళ్లే దారి తప్పారు. తాము ప్రేమ పాఠాలు వల్లిస్తూ తోటి మహిళా ప్రొఫెసర్ ను తమనే పెళ్లాడాలని ఎవరికి వారు బెదిరిస్తున్నారు. రాయలసీమ వర్సిటీలో కలకలం సృష్టిస్తున్నముగ్గురు ప్రొఫెసర్ల ఉదంతమిది....

నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక ప్రొఫెసర్ అంటే కాదు నన్నే చేసుకోవాలని మరో ప్రొఫెసర్...అసలు వాళ్లిద్దరిని కాదు...నన్ను చేసుకోండి అంటూ మూడో ప్రొఫెసర్...ఇలా ఎవరికి వారు ఒక మహిళా ప్రొఫెసర్ ను వేధిస్తూ ఆమెకి చుక్కలు చూపించారు ముగ్గురు రాయలసీమ ప్రొఫెసర్లు. ఇలా తోటి అధ్యాపకురాలిని లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ప్రొఫెసర్ల ఉదంతం బయటపడటం కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో తీవ్ర కలకలం రేపింది.

A Lady Professor harassed by colleagues in Rayalaseema university

రాయలసీమ మహిళా ప్రొఫెసర్లు తెలిపిన వివరాల ప్రకారం...అవివాహితురాలైన ఓ యువతి, మెరిట్ పై కాంట్రాక్టు విభాగంలో 2017 జూలైలో రాయలసీమ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరారు. ఆమెను చూసి మనసు పారేసుకున్నముగ్గురు తోటి ప్రొఫెసర్లు ఎలాగైనా ఆమెని తమ బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటినుంచి ఆమెని నిన్ను పెళ్లాడతామంటూ...నువ్వు కూడా నన్నేపెళ్లాడాలి...అని వేధిస్తున్నారు. ఇలా ముగ్గురు ప్రొఫెసర్లు ఎవరికి వారు పతాక స్థాయిలో తనను టార్చర్ పెడుతుంటే వీరి వేధింపులకి తట్టుకోలేని ఆ మహిళా ప్రొఫెసర్ అసలు ఉద్యోగమే వదిలేసి వెళ్లడానికి సిద్దపడింది.ఈ విషయంతో తోటి మహిళా ప్రొఫెసర్లతో చెప్పి బాధపడగా వారు ఉద్యోగం మానొద్దని, ఈ విషయాన్ని వర్శిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని ఆమెకు నచ్చజెప్పారు.

వర్శిటీ అధికారుల వద్దకు వెళ్లే క్రమంలో ఒత్తిడికి లోనైన ఆమె స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిసింది. దీంతో వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళా ప్రొఫెసర్ ను విద్యార్థులు, ఇతర అధ్యాపకులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కాగా, ఆమెను వేధించిన ప్రొఫెసర్లపై గతంలో కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే వారు ఇంతలా రెచ్చిపోతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారిస్తున్నామని, వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని రాయలసీమ వర్శిటీ రిజిస్ట్రార్ అమర్ నాథ్ హామీ ఇచ్చారు.

English summary
Three professors of Rayalaseema University, Kurnool, have been accused of harassment by a female colleague who was also a professior. The complaint was came to light on monday. University Registrar Amarnath confirmed, "Yes there is a complaint against professors and we have also constituted an inquiry committee".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X