వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి సందేహాలు క‌లిగిస్తున్న కోట‌య్య ఆత్మ‌హ‌త్య..! ఏపి ప్ర‌భుత్వానికి గుదిబండ కానున్న రైతు మ‌ర‌ణం..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : గుంటూరు జిల్లా కొండ‌వీడులో కోట‌య్య అనే రైతు ఆత్మ‌హ‌త్య సంఘ‌ట‌న తెలుగుదేశ ప్ర‌భుత్వ మెడ‌కు చుట్టుకునేలే ప‌ర‌నిణ‌మిస్తోంది. ప్ర‌భుత్వ విధానాల‌ప‌ల్లే రైలు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ప్ర‌తిప‌క్ష వైసీపి బ‌లంగా వాదిస్తోంది. అంతే కాకుండా ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు నేత్రుత్వంలో నిజ నిర్ధార‌ణ క‌మిటీ ఏర్పాటు చేసి వాస్త‌వాల‌ను వెలుగులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది ప్ర‌తిప‌క్ష వైసీపి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హెలికాప్ట‌ర్ లాండింగ్ కోసం కోట‌య్య పొలాన్ని ఆక్ర‌మించుకుని పంట‌ను నాశ‌నం చేసార‌ని, అందుకు త‌గిన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌డానికి ప్ర‌భ‌త్వం నిర‌క‌రించ‌డంతో కోట‌య్య అనే రైతు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు ప్ర‌తిప‌క్ష పార్టీ చెప్పుకొస్తోంది. ఐతే ఇదంతా క‌ట్టుక‌థ అని టిడిపి శ్రేణులు కొట్టి పారేస్తున్నాయి.

 గుంటూరు జిల్లాలో రైతు ఆత్మ హ‌త్య‌..! స‌ర్కారు హ‌త్యే అంటున్న ప్ర‌తిప‌క్షాలు..!!

గుంటూరు జిల్లాలో రైతు ఆత్మ హ‌త్య‌..! స‌ర్కారు హ‌త్యే అంటున్న ప్ర‌తిప‌క్షాలు..!!

క‌ష్టాల్లో ఉన్న ఏపీ ప్ర‌భుత్వానికి రైతు అనుమానాస్ప‌ద మ‌ర‌ణం మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది. రైతు కోట‌య్య ఆత్మ‌హ‌త్య తో చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చిక్కులు త‌ప్ప‌ట్లేదు. తాడును ప‌ట్టుకున్నా పామై క‌రుస్తున్న చందంగా త‌యారయ్యింది ఏపి ప్ర‌భ‌త్వ ప‌రిస్థితి. కొండ‌వీడులో మ‌ర‌ణించిన రైతు కోట‌య్య మ‌ర‌ణం స‌ర్కారు త‌ప్పిద‌మేనంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఆందోళ‌న చేప‌ట్టింది. సీఎం చంద్ర‌బాబు స‌భ కోసం రైతు పొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయ‌టాన్ని జీర్ణించుకోలేక‌, పంట న‌ష్ట‌పోవ‌టంతోనే కోట‌య్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లుగా వైసీపీ ఆరోపిస్తుంది.

 ర‌క‌రకాల వాద‌న‌లు..! పోలీసుల దెబ్బ‌ల‌తో చ‌నిపోయాడంటున్న కుటుంబ‌స‌భ్యులు..!!

ర‌క‌రకాల వాద‌న‌లు..! పోలీసుల దెబ్బ‌ల‌తో చ‌నిపోయాడంటున్న కుటుంబ‌స‌భ్యులు..!!

మ‌రోవైపు రైతు సాగుచేసిన బొప్పాయి కాయ‌ల‌ను కోసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌టంతో వారితో గొడ‌వ ప‌డిన‌ట్లుగా మ‌రో వాద‌న కూడా విన‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు రైతు కోట‌య్య‌పై చేయి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీన్ని అవ‌మానంగా భావించిన కోట‌య్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం, కోట‌య్య ఆర్ధిక‌, ఆరోగ్య విష‌యాల‌తో పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో అక్క‌డున్న పోలీసులు కోట‌య్య‌ను భుజాన వేసుకుని ఆసుప‌త్రికి త‌ర‌లించారంటూ మ‌రో వాద‌న వినిపిస్తున్నారు.

ప్ర‌తిప‌క్ష పార్టీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ..! గ్రామంలోకి అడుగు పెట్ట‌నివ్వ‌ని పోలీసులు..!!

ప్ర‌తిప‌క్ష పార్టీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ..! గ్రామంలోకి అడుగు పెట్ట‌నివ్వ‌ని పోలీసులు..!!

అయితే.. మృతుడి కుటుంబ స‌భ్యులు మాత్రం పోలీసుల దెబ్బ‌ల‌కు తాళ‌లేక మ‌ర‌ణించాడంటూ ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్ర‌భుత్వ కుట్ర‌గా వైసీపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. నిజ‌నిర్ద‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసి, కొండ‌వీడు బ‌య‌ల్దేరారు. మ‌రోవైపు మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు జ‌రిగిన సంఘ‌ట‌న ప‌ట్ల వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. హెలిప్యాడ్ పొలం రైతుది కాద‌ని, కేవ‌లం అత‌డు కౌలురైతు మాత్ర‌మే న‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ ఆరోప‌ణ‌లు రుజువు చేస్తే తాను ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ స‌వాల్ విసిరారు. ఇరు పార్టీల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన‌టంతో గ్రామంలో బ‌య‌టి వ్య‌క్తుల‌ను అనుమ‌తించ‌కుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

 పోలీసులది క‌ట్టు క‌థ‌..! కొట్టి పారేస్తున్న ప్ర‌తిప‌క్షం..!!

పోలీసులది క‌ట్టు క‌థ‌..! కొట్టి పారేస్తున్న ప్ర‌తిప‌క్షం..!!

రైతు ఆర్ధిక ఇబ్బందుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా చెప్పిన అదికారులు ఆత‌ర్వాత మాట మార్చారు. అత‌డు గుండెపోటుతో మ‌ర‌ణించాడంటూ మ‌రో వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు. దీనిపై విచార‌ణ‌కు సీఎం ఆదేశించిన నేప‌థ్యంలో వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తాయంటున్నారు స్థానికులు. కానీ వాస్త‌వాన్ని తొక్కిప‌ట్టి రైతు మ‌ర‌ణానికి అస‌ల కార‌ణాన్ని వ్య‌క్తిగ‌తం చేసి, అదికారులు చేతులు దులిపేసుకుంటార‌నేది ప్ర‌తిప‌క్ష పార్టీ ఆరోప‌ణ‌. ఏమైనా ఎన్నిక‌ల ముందు ఇటువంటి ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇరుకున పెడ‌తాయ‌ని పార్టీ వ‌ర్గాలు అభివ‌ర్ణిస్తున్నాయి.

English summary
Kotaiah, a farmer suicidal incident in Kondavedu in Guntur district is surrounded by the TDP government's neck. The opposition is strongly arguing that the Kotayya committed suicide on government policies. In addition, the opposition YCP is trying to bring real facts into that case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X