• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉద్యోగం ఇప్పిస్తానంటూ లాడ్జీకి తీసుకెళ్లి రేప్: నగ్నవీడియోలు తీసి పలుమార్లు ఘాతుకం

|

అమరావతి: రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులో ఈ ఘటన జరగడంతో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కొత్తపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు

ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆ మహిళ హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉందని తెలుసుకున్న బ్రహ్మయ్య.. తాను అక్కడకు వెళ్లి తనకు తెలిసినవాళ్లు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు.

లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం

లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం

జులై 11న ఆమెను ఉద్యోగ విషయం మాట్లాడదామని గుంటూరు తీసుకొచ్చాడు బ్రహ్మయ్య. రైలుపేటలోని ఓ లాడ్జీకి తీసుకొచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు. లాడ్జీలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు తీసినట్లు బాధిరాతులు తన ఫిర్యాదులో పేర్కొంది.

నగ్న వీడియోలు తీసి మహిళపై పలుమార్లు రేప్

నగ్న వీడియోలు తీసి మహిళపై పలుమార్లు రేప్

ఈ విషయం ఎవరికైనా చెప్పినా.. తాను రమ్మని చెప్పునప్పుడల్లా రాకపోయినా ఆ వీడియోలు అందరికీ పంపిస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడని బాధితురాలు పేర్కొంది. అప్పట్నుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని దర్శి పోలీసులకు చేసిన ఫిర్యాదులు తెలిపింది. ఘటన గుంటూరులో చోటు చేసుకోవడంతో కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరులో యువతి అనుమానాస్పద మృతి

గుంటూరులో యువతి అనుమానాస్పద మృతి

ఇది ఇలావుండగా, గుంటూరు జిల్లా కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 17ఏళ్ల యువతి రెండ్రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు రాకముందే అంత్యక్రియలు పూర్తి చేయడం, విచారణలో ఆమె తల్లిదండ్రులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అనుమానాస్పాద మృతిగా కేసు నమోదు చేశారు.

కాగా, మృతురాలు తన డైరీలో అన్నయ్యకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నానని రాసింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, మిగితా విషయాలను పరిశీలిస్తున్నారు. డైరీలోని విషయాల సారాంశం ఏమిటి? బాలిక ఎందుకు? ఎలా చనిపోయిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సచివాలయ మహిళా పోలీసు మృతురాలి ఇంటికి చేరుకుని పోలీసుల వచ్చేవరకూ అంత్యక్రియలు చేయొద్దని చెప్పినా.. ఆ లోపే దహనం చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

కూతురు ఆత్మహత్యపై తల్లిదండ్రుల పొంతనలేని సమాధానాలు

కూతురు ఆత్మహత్యపై తల్లిదండ్రుల పొంతనలేని సమాధానాలు

ఈ ఘటనపై బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డైరీతోపాటు పురుగుల మందు డబ్బా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడితే ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కానీ అలా చేయకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరిదో పుట్టినరోుకు వెళ్లి వచ్చాక వాంతులు చేసుకుందని ఒకసారి, ఆరోగ్యం బాగోలేదని మరోసారి కుటుంబీకులు చెప్పారని, వారు చెప్పిన సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయన్నారు.

కాగా, అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలో మృతురాలి ఎముకలు సేకరించినట్లు తెలిపారు. మరో ఘటనలో విజయనగరం జిల్లాలో తాను పెళ్లి చేసుకోనున్న యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతితోపాటు ఆమె కుటుంబసభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

English summary
A man allegedly raped a woman in Guntur district, pretext of job opportunity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X