వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య .. రోజురోజుకీ పెరుగుతున్న అపోహలు

|
Google Oneindia TeluguNews

కరోనా భయం ప్రజలను ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానంతోఒక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో జరిగింది .ఇక శనివారం,మాచర్ల మండలం కొత్త పల్లిలో చేటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే అక్కల సంజీవయ్య (44) అనే వ్యక్తి తనకు జ్వరం రావటంతో కరోనా అని భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు .

కరోనా భయంతో సంజీవయ్య చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చిన సంజీవయ్య గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.. ఇక ఆయన తనకు కరోనా ఉందని తీవ్ర వేదనకు గురయ్యారు. కొడుకుకు ఫోన్‌ చేసి తనకు కరోనా వైరస్‌ సోకిందేమోనని అనుమానంగా ఉంది. నా వల్ల ఊరంతా వైరస్ వస్తుందని భయంగా ఉంది . నేను పోతే దూరంగా ఉండి చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 A man suicide due to corona fear .. Increasing myths of corona

కరోనా వైరస్ ప్రభావం ప్రజల మీద ఎలా ఉన్నా , ప్రజలలో మాత్రం అపోహలను రోజు రోజుకూ పెంచుతుంది. ఆహరం దొరక్క కొందరు , అనారోగ్యంతో కొందరు , లిక్కర్ అలవాటు ఉండి తాగటానికి మందు దొరక్క మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు కరోనా కరాళ నృత్యం చేస్తుంది అని చెప్పటానికి ఉదాహరణగా చెప్పొచ్చు . ఏది ఏమైనా కరోనా బాధితులుగా కాక కరోనా వచ్చింది అన్న భయం ఇంకా ఎంతమంది ప్రాణాలు హరిస్తుందో ..

English summary
Corona fear causes people to commit suicide. A man committed suicide by hanging himself to a tree on suspicion of coronavirus infection.On Saturday, Macharla Mandal, kotta palli, a man named akkala sanjeevaiah committed suicide while he was suffered with fever .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X